ఇక పేదోళ్లకు కూడా కార్పోరేట్ వైద్యం.. నేడే సనత్‌నగర్ TIMS ప్రారంభం.. అందుబాటోకి వచ్చే సేవలు ఇవే!

తెలంగాణ వైద్య రంగంలో నేడు మరో చారిత్రాత్మక ఘటం ఆవిష్కృతం కానుంది. నిరుపేదలకూ సూపర్ స్పెషాల్టీ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్​నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హాస్పిటల్‌ ప్రారంభం కానుంది. మరి టిమ్స్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయాలేంటో చూద్దాం పదండి.

ఇక పేదోళ్లకు కూడా కార్పోరేట్ వైద్యం.. నేడే సనత్‌నగర్ TIMS ప్రారంభం.. అందుబాటోకి వచ్చే సేవలు ఇవే!
Dr. Marri Chenna Reddy Tims Sanathnagar Opens Today (1)

Updated on: Aug 17, 2026 | 10:37 AM

తెలంగాణ వైద్య చరిత్రలో నేడో చారిత్రాత్మక ఘటం ఆవిష్కృతం కానుంది. అత్యాధునిక హంగులతో ముస్తాబైన సనత్​నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం రూ. రూ.1,126 కోట్ల ఖర్చుతో 22.67 ఎకరాల విస్తీర్ణంంలో 1000 పడకల్లో ఈ హాస్పిటల్‌ను నిర్మించారు. ఈ హాస్పిటల్‌లో మొత్తం 37 విభాగాల్లో ప్రజలకు సేవలు అందనున్నాయి.

వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్లు

అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్, వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ చికిత్సల కోసం అవసరమైన అధునాతన వైద్య పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో జనరల్ ట్రీట్‌మెంట్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సలు అందిస్తారు. అవయవ మార్పిడి కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను అభివృద్ధి చేశారు.

మూడు ప్రధాన బ్లాకులుగా హాస్పిటల్‌ నిర్మాణం

A బ్లాక్‌లో అత్యవసర వైద్య సేవలతోపాటు 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి.

B బ్లాక్‌లో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంతోపాటు రెండు క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.

C బ్లాక్‌లో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లతోపాటు సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి.

4 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు

అంతేకాదు ఈ హాస్పిటల్‌ను ప్రధానంగా 4 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ కార్డియాక్‌, నెఫ్రాలజీ–యూరాలజీ, అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నారు. ఇక ఈ ఆస్పత్రిని రెండు విడతల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి 28 వైద్య విభాగాలు సేవలు అందించనున్నాయి. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ , 11 బ్రాడ్ స్పెషాలిటీ..6 డయాగ్నస్టిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లతో పాటు అనుబంధ విభాగాలున్నాయి.

త్వరలో మరో 9 డిపార్ట్‌మెంట్లు

మిగతా 9 డిపార్ట్‌మెంట్లను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే 16 థియేటర్లు సిద్ధం చేశారు. మరో 16 థియేటర్లను స్టాండ్ బై గా ఉంచారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో మందులు, శాంపిల్స్ వేగంగా పంపడానికి న్యూమాటిక్ షూట్ సిస్టమ్ ఉంది. ఇక నిమ్స్‌ మాదిరిగానే టిమ్స్‌ కూడా స్వయం ప్రతిపత్తి హోదాతో సేవలు అందిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us