Hyderabad: నోటీసులు ఇచ్చినా అరెస్టులు చేసినా నేను సిద్ధం.. రఘునందన్ రావు కామెంట్

జూబ్లీహిల్స్‌(Jubilee Hills Case) సామూహిక అత్యాచార ఘటనలో వీడియోలు, ఫొటోలు లీక్ చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఎమ్మెల్యే రఘునందన్ స్పందించారు....

Hyderabad: నోటీసులు ఇచ్చినా అరెస్టులు చేసినా నేను సిద్ధం.. రఘునందన్ రావు కామెంట్
Raghunandan
Follow us

|

Updated on: Jun 08, 2022 | 11:49 AM

జూబ్లీహిల్స్‌(Jubilee Hills Case) సామూహిక అత్యాచార ఘటనలో వీడియోలు, ఫొటోలు లీక్ చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఎమ్మెల్యే రఘునందన్ స్పందించారు. తనపై కేసులు పెడితే లీగల్‌గా ఎదుర్కొంటానని వెల్లడించారు. నోటీసులు ఇచ్చినా, పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బాలికకు సంబంధించిన ఎలాంటి విషయాలు తాను వెల్లడించలేదని రఘునందన్‌రావు(MLA Raghunandan Rao) అన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే తనపై బురద జల్లుతుందని మండిపడ్డారు. బాధితురాలి న్యాయం జరిగేంత వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కేసులో కాంగ్రెస్‌ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని, అమ్నీషియా పబ్‌ లో కాంగ్రెస్‌ నేతల పిల్లలు కూడా ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

ఘటన జరిగిన రోజు ఏం జరిగిందంటే.. నిందితులు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం పబ్‌లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మే 28వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు బాలిక తన స్నేహితుడితో కలిసి పబ్‌కి వెళ్లింది. కాసేపటికే ఆమె ఫ్రెండ్ పని ఉందని బయటకు వెళ్లాడు. 3 గంటలకు కొందరు అపరిచిత వ్యక్తులు పబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలికను చూసిన ఆరుగురు నిందితులు ప్లాన్ వేసుకున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు సాదుద్దీన్ అనే వ్యక్తి బాలికతో అసభ్యంగా మాట్లాడాడు.

ఇవి కూడా చదవండి

బాధితురాలిని ఏమార్చి సాయంత్రం 5.43 గంటలకు బెంజ్‌కారులో ఎక్కించుకున్నారు. బెంజ్ కారును ఇన్నోవాలో మరో నలుగురు ఫాలో అయ్యారు. పెద్దమ్మ గుడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. గుడి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో బాలికపై నిందితులు ఒకరి తరువాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాదితురాలిని రాత్రి 7.31 గంటలకు పబ్‌ దగ్గర వదిలి వెళ్లారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest Articles