అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, ఉక్కపోతతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ మూడు రోజుల హెచ్చరిక జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరోవైపు వడగాల్పుల హెచ్చరికలు కూడా జారీ చేశారు.

అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్
Weather Report

Updated on: May 19, 2026 | 5:06 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం,6° ఉత్తర అక్షాంశం /79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం /90° తూర్పు రేఖాంశం, 13.5° ఉత్తర అక్షాంశం /95° తూర్పు రేఖాంశం, 15.5° ఉత్తర అక్షాంశం /98° తూర్పు రేఖాంశం గుండా వెళుతుంది. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి – ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు మే 26వ తేదీ నాటికి 4 రోజులు ముందు లేదా 4 రోజులు తరువాత కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది. దీంతోపాటు నిన్నటి ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.

ద్రోణి/గాలుల అంతరాయం, దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి, కేరళ, దక్షిణ అంతర కర్ణాటక – రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాంలో రాగల 2 రోజుల్లో వడగాలులు ఒకట లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. తదుపరి 3వ రోజు నుండి 4వ రోజు వరకు తీవ్రవడగాలులు ఒకట లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఆ తదుపరి 5వ రోజు నుండి 7వ రోజు వరకు వడగాలులు ఒకట లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us