పామాయిల్, డాల్డా, కొబ్బరి నూనె.. మీరు కొనేది నెయ్యేనా..?

తెలంగాణలో కల్తీ నెయ్యి విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 సంస్థల్లో తనిఖీలు చేపట్టి 91 నెయ్యి నమూనాలను సేకరించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో 14 చోట్ల తనిఖీలు జరిపి 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.

పామాయిల్, డాల్డా, కొబ్బరి నూనె.. మీరు కొనేది నెయ్యేనా..?
Adulterated Ghee

Updated on: Jul 17, 2026 | 12:37 PM

ఎక్కడ చూసినా కల్తీనే.. ఏది తిన్నా కల్తీనే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా.. కల్తీగాల్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలు, దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) ప్రాంతంలో 14 చోట్ల తనిఖీలు చేసి.. 15 చోట్ల నెయ్యి నమూనాల సేకరించారు. హైదరాబాద్‌లో 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. 60 కిలోల కలుషిత నెయ్యిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. శాంపిల్స్ ల్యాబ్‌కు పంపారు. పామ్ ఆయిల్, వనస్పతి, కొబ్బరి నూనె కలిపి నెయ్యి తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. కల్తీ నెయ్యిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నెయ్యి విక్రయదారులపై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. 91 నమూనాలు సేకరించారు. మొత్తం 65 సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లాల్లో 5 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ CURE ప్రాంతంలో 14 చోట్ల తనిఖీలు చేసి నెయ్యి నమూనాలను సేకరించారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ నెయ్యి విక్రయం ఫుడ్ సేఫ్టీ చట్టం ఉల్లంఘన అని.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు.

సాధారణంగా స్వచ్ఛమైన నెయ్యిలో 99.5% మిల్క్ ఫ్యాట్ తప్పనిసరిగా ఉండాలి.. అలాగే 0.5% కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. అయితే.. డబ్బుల కోసం దందా నిర్వహిస్తున్న కేటుగాళ్లు పామ్ ఆయిల్, వనస్పతి, కొబ్బరి నూనె కలిపిన నెయ్యి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.

వీడియో చూడండి..

Follow Us