Viral: ఇదెక్కడి చోద్యం సామీ! దొంగోడి గొంతెమ్మ కోరికలు పోలీసులు షాక్.. సీన్ కట్ చేస్తే.!

ఇక్కడ ఓ దొంగోడు.. సీఎం రావాలి.. మీడియా రావాలి అంటూ గొంతెమ్మె కోరికలు కోరాడు. ఓ చోరీ కేసులో పోలీసులకు దొరక్కండా చెరువులోకి దిగి అక్కడ ఓ బండపైకి ఎక్కి ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి ఖాకీలకు దొరక్కుండా తప్పించుకున్నాడు. హైదరాబాద్‌లోని సూరారం ప్రాంతంలో ఓ దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు.

Viral: ఇదెక్కడి చోద్యం సామీ! దొంగోడి గొంతెమ్మ కోరికలు పోలీసులు షాక్.. సీన్ కట్ చేస్తే.!
Telangana

Edited By: Ravi Kiran

Updated on: Dec 16, 2023 | 11:22 AM

ఇక్కడ ఓ దొంగోడు.. సీఎం రావాలి.. మీడియా రావాలి అంటూ గొంతెమ్మె కోరికలు కోరాడు. ఓ చోరీ కేసులో పోలీసులకు దొరక్కండా చెరువులోకి దిగి అక్కడ ఓ బండపైకి ఎక్కి ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి ఖాకీలకు దొరక్కుండా తప్పించుకున్నాడు. హైదరాబాద్‌లోని సూరారం ప్రాంతంలో ఓ దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. స్థానిక శివాలయం నగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దొంగ.. ఇంటి యజమాని రావడంతో సమీపంలోని చెరువులోకి దూకాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చెరువులోని ఓ బండరాయిపై తిష్టవేసిన దొంగను బయటకు రప్పించే ప్రయత్నం చేశారు.

దయచేసి బయటకు రావాలని.. దొంగను ఏమీ చేయం అంటూ మైక్‌లో అనౌన్స్‌మెంట్‌లు చేశారు పోలీసులు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌, టీవీ ఛానల్స్‌ వస్తేగానీ చెరువులో నుంచి బయటికి వచ్చేదిలేదంటూ తెగేసి చెప్పాడు..ఆ దొంగ. పోలీసులు ఎంత పిలిచినా దొంగ చెరువులోంచి బయటకు రాలేదు. అర్ధరాత్రి దాటిపోతోంది. ఆ టైమ్‌లో పోలీసులు అక్కడే చిన్న బ్రేక్‌ తీసుకోవడం.. ఇదే అదునుగా దొంగ పారిపోవడం జరిగిపోయాయి. ఆ కంత్రీ దొంగ కోసం గాలింపు కొనసాగుతోంది.