Telangana News: మెడికల్ షాపులో అడిగితే ఇవ్వనన్నారు.. కట్ చేస్తే.. ఆన్‌లైన్‌లో తెప్పించుకొని మరీ.. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి దాన్ని సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఎదురుగా ఉన్న ఇంటి వారు ఎంత తలుపు కొట్టి చూసిన తెరవకపోవటంతో తలుపు బద్దలు కొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Telangana News: మెడికల్ షాపులో అడిగితే ఇవ్వనన్నారు.. కట్ చేస్తే.. ఆన్‌లైన్‌లో తెప్పించుకొని మరీ.. 
Software Engineer Sucide

Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 13, 2024 | 8:34 AM

ఆన్‌లైన్‌లో ఈ పదార్థాలు ఆర్డర్ చేసి సేవించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి చెందింది. హైదరాబాద్ మియాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల క్రితం మనోజ్ అనే కాంట్రాక్టర్‌ను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ నాగలక్ష్మి వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరికీ ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే తరచూ ఇద్దరు మధ్య వివాదాలు మనస్పర్ధలు, గొడవలు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకోవాలని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే మెడికల్ షాపులకు వెళ్లి పాయిజన్ బాటిల్ కావాలని అడిగింది. అయితే మెడికల్ షాప్ నిర్వాహకులు నిరాకరించటంతో ఆన్‌లైన్‌లో విష పదార్థాలు ఆర్డర్ చేసింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆర్డర్ చేసుకున్న విష పదార్థాలను స్వీకరించి ఆత్మహత్యకు పాల్పడింది. ఎదురుగా ఉన్న ఇంటి వారు ఎంత తలుపు కొట్టి చూసిన తెరవకపోవటంతో తలుపు బద్దలు కొట్టి చూశారు. విగతాజీవిగా పడి ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ నాగలక్ష్మిని చూసి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వ్యవహారంపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వివాహమైన కొద్ది నెలలకే భర్తతో విభేదాలు రావడంతో మానసికంగా కృంగిపోయిన నాగలక్ష్మి ఈ తరహా ఆలోచన చేసి ఉంటుందని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురి ఆత్మహత్యకు కారణమైన భర్త మనోజ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాగలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత నెల 26న ఆన్‌లైన్‌లో విషపదార్థాల కోసం నాగలక్ష్మి వెతికినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. గత నెల 29న ఈ పదార్థాలు డెలివరీ సైతం అయ్యాయి. అయితే అవి వచ్చిన 15 రోజుల తర్వాత నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని ఆధారాలను సేకరించారు. భర్త మనోజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి