హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ 16 ఏళ్ల బాలుడు మృతి

Hyderabad Sadar Sammelan Turns Tragic: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో జరుగుతున్న సదర్ సమ్మేళనంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దున్నపోతును ఆడిస్తున్న 16 ఏళ్ల బాలుడు భవాని శంకర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. మరోవైపు నారాయణగూడ సదర్ ఉత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు.

హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ 16 ఏళ్ల బాలుడు మృతి
Hyderabad Sadar Sammelan Turns Tragic

Updated on: Nov 10, 2026 | 12:06 AM

Hyderabad Sadar Sammelan: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో సదర్ సమ్మేళనం సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. సదర్ ఉత్సవాల్లో భాగంగా దున్నపోతును ఆడిస్తున్న 16 ఏళ్ల బాలుడు భవాని శంకర్ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఉత్సవ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నగరంలో సదర్ సమ్మేళనం వేడుకలు ఘనంగా జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దున్నపోతును ఆడిస్తున్న బాలుడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయినట్లు సమాచారం. అక్కడున్న వారు వెంటనే స్పందించినప్పటికీ.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆల్ ఇండియా యాదవ్ మహాసభ ఉపాధ్యక్షుడు పోచబోయిన గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. యాదవ సామాజిక వర్గం సంప్రదాయంగా నిర్వహించే ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు

ఇదిలా ఉండగా.. నారాయణగూడలో సదర్ ఉత్సవ మేళా నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. నవంబర్ 10 రాత్రి 7 గంటల నుంచి నవంబర్ 11 తెల్లవారుజామున 4 గంటల వరకు వైఎంసీఏ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నారు.

ఆర్టీసీ బస్సులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సదర్ మేళాకు వచ్చే సందర్శకులు తమ వాహనాలను కేశవ్ మెమోరియల్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో నిలిపి వేయాలని అధికారులు సూచించారు. సదర్ ఉత్సవాల సందర్భంగా ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. కాగా, నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సదర్ ఉత్సవాల సందడి నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us