హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రద్దీ తగ్గించేందుకు 60 కొత్త కోచ్‌లు!

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఊరట లభించే అవకాశం ఉంది. పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు రూ.923.62 కోట్ల అంచనా వ్యయంతో 60 కొత్త మెట్రో కోచ్‌ల కొనుగోలుకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈ కోచ్‌లు అందుబాటులోకి వస్తే రైళ్ల సామర్థ్యం పెరిగి, రద్దీ మార్గాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రద్దీ తగ్గించేందుకు 60 కొత్త కోచ్‌లు!
Hyderabad Metro Rail

Updated on: Oct 22, 2026 | 1:13 PM

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్త. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మరో 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ కొనుగోలుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.923.62 కోట్లను ఖర్చు చేయనున్నట్లు అంచనా.

టెండర్ ప్రక్రియలో భాగంగా ఎంపికైన సంస్థ.. కొత్త కోచ్‌ల రూపకల్పన, తయారీ, సరఫరా, పరీక్షలు, కమిషనింగ్‌తో పాటు 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న సంస్థలు 2027 జనవరి 13వ తేదీ వరకు తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. జనవరి 14న సాంకేతిక బిడ్లను తెరిచి, అనంతరం అర్హతలు, ఆర్థిక ప్రతిపాదనలను పరిశీలించి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయనున్నారు. కొత్త కోచ్‌ల తయారీ, సరఫరా తదితర పనులకు సుమారు 125 వారాల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో 57 రైళ్లు నడుస్తున్నాయి. ఒక్కో రైలులో మూడు కోచ్‌లు ఉండగా, రోజూ దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. తాజాగా కొనుగోలు చేయనున్న 60 కోచ్‌లతో ఆరు కోచ్‌లు కలిగిన 10 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఐటీ కారిడార్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త కోచ్‌లతో రైళ్ల ప్రయాణికుల సామర్థ్యం పెంచేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా రద్దీని నియంత్రించడంతో పాటు మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు వీలవుతుంది. మెట్రో ఫేజ్‌-1 యాజమాన్య బదిలీ, ఫేజ్‌-2 ఆమోద ప్రక్రియలు కొనసాగుతున్నప్పటికీ, అదనపు కోచ్‌ల కొనుగోలుకు చర్యలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us