Hyderabad: హోటల్ కిచెన్లలో బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు.. 14 హోటళ్ల లైసెన్సులు రద్దు!

హైదరాబాద్ మహానగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్రతపై TG SAFE అధికారులు కొరడా ఝళిపించారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లపై అక్టోబర్ 31న భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. TG SAFE ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 22 ప్రత్యేక బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసుల సహకారంతో మొత్తం 22 ఆహార సంస్థల్లో తనిఖీలు చేపట్టాయి.

Hyderabad: హోటల్ కిచెన్లలో బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు.. 14 హోటళ్ల లైసెన్సులు రద్దు!
Hyderabad Hotel Raids
Image Credit source: AI Image

Updated on: Oct 31, 2026 | 8:43 PM

హైదరాబాద్ మహానగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్రతపై TG SAFE అధికారులు కొరడా ఝళిపించారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లపై అక్టోబర్ 31న భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. TG SAFE ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 22 ప్రత్యేక బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసుల సహకారంతో మొత్తం 22 ఆహార సంస్థల్లో తనిఖీలు చేపట్టాయి.

ఈ తనిఖీల్లో పలు హోటళ్ల కిచెన్లలో దారుణమైన అపరిశుభ్ర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు సంచరిస్తుండగా.. కొన్ని చోట్ల ఎలుకల వ్యర్థాలు కనిపించాయి. కుళ్లిపోయిన కూరగాయలు, ఫంగస్ పట్టిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన ఫుడ్ ఐటమ్స్‌ను గుర్తించారు. వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను ఒకే ఫ్రిజ్‌లో నిల్వ చేయడంతో పాటు, వండిన ఆహార పదార్థాలను సరైన లేబుల్స్ లేకుండా భద్రపరుస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కొన్ని హోటళ్లలో వంట నూనెను పదేపదే వినియోగిస్తుండగా, వంటగదుల్లో మురికి నీరు నిల్వ ఉండటం, అపరిశుభ్రమైన ఫ్రిజ్‌లు, తుప్పుపట్టిన వంట పాత్రలు, మురికిగా ఉన్న చిమ్నీలు, ఎగ్జాస్ట్‌లను గుర్తించారు. అంతేకాకుండా ఆహార తయారీలో పాల్గొనే సిబ్బంది హెయిర్ నెట్స్, గ్లౌజులు, అప్రాన్లు ధరించకుండా విధులు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.

ఈ ఉల్లంఘనలపై చర్యలు చేపట్టిన TG SAFE అధికారులు అనుమానాస్పద కల్తీపై 21 ఆహార నమూనాలను సేకరించారు. కుళ్లిన కూరగాయలు, కలుషిత ఆహార పదార్థాలు, గడువు ముగిసిన వస్తువులు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలు కలిపి మొత్తం 544 కిలోల ఆహారాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. పదేపదే వినియోగిస్తున్నారనే అనుమానంతో మరో 13 కిలోల వాడిన వంట నూనెను పారబోశారు.

తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించిన తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, హోటల్ సబ్జీ, పిస్తా హౌస్, స్వీకార్ హోటల్, మండీ @ 36 అరేబియన్ కిచెన్, గోల్కొండ హోటల్ అండ్ రిసార్ట్స్, ఇంపీరియల్ మల్టీకుజిన్ రెస్టారెంట్, తైబా బేకరీలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

మరోవైపు, తీవ్ర అపరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన 14 హోటళ్లు, రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై జరిమానాలతో పాటు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us