Hyderabad: బోర్‌వెల్ తవ్వాలంటే ఇక అనుమతి తప్పనిసరి.. నవంబర్ 1నుంచి కొత్త నిబంధనలు!

హైదరాబాద్‌లో భూగర్భ జలాల వినియోగంపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ప్రజా తాగునీటి వనరులకు సమీపంలో కొత్తగా బోర్‌వెల్ తవ్వాలనుకునేవారు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మండల రెవెన్యూ అధికారి (MRO) అనుమతి, సంబంధిత అధికారుల పరిశీలన లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు చేపడితే నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది.

Hyderabad: బోర్‌వెల్ తవ్వాలంటే ఇక అనుమతి తప్పనిసరి..  నవంబర్ 1నుంచి కొత్త నిబంధనలు!
Hyderabad Borewell Rules

Updated on: Oct 31, 2026 | 8:00 PM

హైదరాబాద్‌లో భూగర్భ జలాల వినియోగంపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ప్రజా తాగునీటి వనరులకు సమీపంలో కొత్తగా బోర్‌వెల్ తవ్వాలనుకునేవారు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మండల రెవెన్యూ అధికారి (MRO) అనుమతి, సంబంధిత అధికారుల పరిశీలన లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు చేపడితే నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

బోర్‌వెల్ కోసం దరఖాస్తు చేయాలంటే ఏ పత్రాలు కావాలి?

ప్రజా తాగునీటి వనరుల సమీపంలో బోర్‌వెల్ తవ్వాలనుకునే వారు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్దేశిత దరఖాస్తును సమర్పించాలి. ఇందుకోసం కొన్ని కీలక పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

– ఆస్తికి సంబంధించిన రిజిస్టర్‌డ్ సేల్ డీడ్ పత్రాలు.

– దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, చిరునామా రుజువు.

– స్థల సరిహద్దులు, నిర్మాణ వివరాలు చూపించే మ్యాప్.

– సమీపంలో ఉన్న బోర్‌వెల్‌ల వివరాలు.

– GHMC లేదా సంబంధిత మున్సిపల్ సంస్థ నుంచి అవసరమైన అనుమతులు.

దరఖాస్తు అందిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే భూగర్భ జలాల నిపుణులు కూడా తనిఖీలు నిర్వహించి బోర్‌వెల్ తవ్వడం వల్ల నీటి వనరులపై ఎలాంటి ప్రభావం పడుతుందో అంచనా వేస్తారు.

250 మీటర్ల నిబంధన తప్పనిసరి

తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ (WALTA) చట్టం ప్రకారం ప్రజా తాగునీటి వనరులకు 250 మీటర్ల పరిధిలో బోర్‌వెల్ తవ్వకాలపై ప్రత్యేక నియంత్రణలు ఉన్నాయి. ఈ పరిధిలో బోర్‌వెల్ తవ్వాలంటే సంబంధిత అధికారుల అనుమతి అవసరం. ప్రజా తాగునీటి వనరులకు ఎలాంటి నష్టం కలగదని అధికారులు నిర్ధారించిన తర్వాతే అనుమతిపై నిర్ణయం తీసుకుంటారు. అయితే చట్టంలో పేర్కొన్న కొన్ని మినహాయింపులు కూడా వర్తిస్తాయి.

నిర్మాణ పనులకు గ్రీన్ వాటర్ ట్యాంకర్లే ఆధారం

మరోవైపు హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి సంబంధించి కూడా కీలక మార్పులు తీసుకొస్తున్నారు. భూగర్భ జలాలను వినియోగించి నిర్మాణ పనులు చేపట్టడంపై ఆంక్షలు విధించే చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మాణ అవసరాల కోసం కొత్త బోర్‌వెల్‌లకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి నిర్మాణ స్థలాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన రీసైకిల్ నీటిని HMWSSB గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నారు.

అత్యవసర తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త బోర్‌వెల్‌లకు అనుమతుల విషయంలో కఠినమైన పరిశీలన ఉంటుందని గ్రౌండ్ వాటర్ శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసర తాగునీటి అవసరాలకు మాత్రమే నిబంధనలకు లోబడి అనుమతులు పరిశీలించనున్నారు. భూగర్భ జలాల లభ్యత, ప్రాంతంలోని నీటి పరిస్థితి, సమీపంలోని ప్రజా తాగునీటి వనరులపై ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

మొత్తంగా హైదరాబాద్‌లో భూగర్భ జలాల వినియోగంపై ఆంక్షలు కఠినతరం కానున్నాయి. బోర్‌వెల్ తవ్వాలనుకునేవారు ముందుగా సంబంధిత అధికారులను సంప్రదించి అనుమతుల వివరాలు తెలుసుకోవాలి. నిర్మాణదారులు కూడా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే శుద్ధి చేసిన నీటిని వినియోగించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us