Hyderabad Rains: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అమీర్ పేట్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ప్రాంతాలతో సహా సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిన్న వర్షానికే నగరంలోని పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోతాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని గంటలుగా భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం జనజీవనాన్ని ఇబ్బందులకు గురి చేసింది.
హైదరాబాద్ లోని పలు కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా రహదారులపై వరద నీరు ఏరులై పారుతుంది. మూసీ పరివాహక ప్రాంతలోని డ్రైనేజ్ నీరు పొంగిపొర్లుతోంది. అంబర్ పేట లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇల్లులోకి నీరు చేరుకుంది. నీటమునిగిన ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ఇప్పటి వరకూ ఉప్పల్ లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కగా .. హయత్ నగర్ లో 19.2 సెంటీమీటర్లు.. సరూర్ నగర్ లో 17.2 సెం. మీ వర్షపాతం నమోదదయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు. మరోవైపు మూసారంబాగ్ వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ వైపు నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
తాజాగా, తెలంగాణలో రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ లోని వాతావరణం చల్లగా ఉంది. ముఖ్యంగా సాయంత్రమైతే చాలు వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో మరో 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: AP CM Jagan: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలుకు జీవో జారీ..