సోషల్ మీడియా ట్రెండ్ విచిత్ర కొత్త పుంతలు తొక్కుతుంది.. యూట్యూబ్ ఛానల్స్‌లో సబ్ స్క్రైబర్స్ & వ్యూస్ సంఖ్య పెంచుకోవడం కోసం కొందరు యూట్యూబర్స్ పడుతున్న పడరాని పాట్లు జనంలో చర్చగా మారుతున్నాయి.. కొందరు ఆసక్తికర కారణాలు, క్రియేటివ్ థింగ్స్ తో జనం దృష్టిని ఆకర్షించి వ్యూస్ సంఖ్య పెంచుకుంటే మరికొందరు విచిత్ర ప్రయత్నాలతో సబ్స్క్రైబర్స్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగమే ఈ సమోసా ఆఫర్… తన ఛానల్ సబ్ స్కైబ్ చేసుకున్న వారికి అక్కడిక్కడే సమోసాలు బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఓ సమోసా సెంటర్ నిర్వాహకుడు.
ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్
హనుమకొండలోని వడ్డేపల్లి కి చెందిన ఓ సమోసా బండి నిర్వాహకుడు తన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అక్కడికక్కడే ఇన్స్టంట్ గా సమోసా ఆఫర్ ప్రకటించాడు.. తన చానల్లో సబ్ స్క్రైబ్ చేసుకుంటే అప్పటికప్పుడు వెంటనే పది రూపాయల సమోసా ఫ్రీగా ఇస్తున్నాడు.. సమోసా ఫ్రీ పేరుతో ఆయన సమోసా బండి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
janmounika@volg అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్న సమోసా సెంటర్ నిర్వాహకుడు ఈ విధంగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.. తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి పది రూపాయల సమోసాలు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.. ఈ విచిత్ర ఆఫర్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.. కొందరు నవ్వుకుని వెళ్ళిపోతున్నారు
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి