Guinness record: యువకుని కోరిక తీర్చిన పెన్సిల్‌.. ఏకంగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం..

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గౌరీ శంకర్ అనే యువకుడు చిన్న తనం నుంచి అద్భుతమైన కళాఖండాలను రూపొందించేవాడు. తనకున్న హాబీని ఒక అద్భుతమైన కళగా మార్చుకుని సూక్ష్మకళ నైపుణ్యం తెచ్చుకుంటూ బొమ్మలు చెక్కేవాడు. చాక్ పీస్ తో మొదలైన తన అద్భుత సూక్ష్మ కళాఖండాలను పెన్సిల్ మొనలపై శిల్పాలు చెక్కడం ప్రారంభించి ఔరా...

Guinness record: యువకుని కోరిక తీర్చిన పెన్సిల్‌.. ఏకంగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం..
Gowrishankar
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jun 07, 2024 | 7:36 PM

పెన్సిల్ కోరిక తీర్చడం ఏంటి..? అని అనుకుంటున్నారు కదూ! ప్రతి జీవికి కోరికలు ఉంటాయి..! అందులోనూ మనుషులకు చాలా కోరికలు ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. కానీ తమ కోరికలను నెరవేర్చుకోవడానికి కఠోర దీక్షగా శ్రమించే వారు కొందరే ఉంటారు. వారు మాత్రమే సాధ్యమైనంత వరకు వారి కోరికలను…లక్ష్యాలను అధిగమిస్తారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గౌరీ శంకర్ అనే యువకుడు చిన్న తనం నుంచి అద్భుతమైన కళాఖండాలను రూపొందించేవాడు. తనకున్న హాబీని ఒక అద్భుతమైన కళగా మార్చుకుని సూక్ష్మకళ నైపుణ్యం తెచ్చుకుంటూ బొమ్మలు చెక్కేవాడు. చాక్ పీస్ తో మొదలైన తన అద్భుత సూక్ష్మ కళాఖండాలను పెన్సిల్ మొనలపై శిల్పాలు చెక్కడం ప్రారంభించి ఔరా… అనిపించాడు. అంతటితో ఆగకుండా మైక్రో ఆర్టిస్టు ప్రపంచ వ్యాప్తంగా తాను ఒక గుర్తింపు సాధించాలని కలలు కన్నాడు. కలలు కనడమే కాదు…తన కలలను సాకారం చేసుకునేందుకు ఎన్నో నిద్రలు లేని రాత్రులు గడిపాడు.

తన కోరిక…తన లక్ష్యం….తన అభిరుచి….అంతా ఒక్కటే..ప్రపంచ స్థాయి ” వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్” లో తన పేరున ఒక పేజీ ఉండాలి. ఆ స్థాయిలో గుర్తింపు సాధించాలి అని పట్టు వదలని విక్రమార్కుడులా పాటు పడ్డాడు. ఇంతకు ఆయన శ్రమను గుర్తించి,ఆయన తపనను మన్నించి, తనకు అంతటి గుర్తింపు తెచ్చింది ఎవరో కాదని, తన జీవితాన్ని మార్చిన పెన్సిల్‌ అని చెబుతున్నాడు శంకర్‌. తన లక్ష్య సాధన కోసం తాను నమ్ముకున్న మైక్రో ఆర్టిస్టు వృత్తి…ఈ రోజున తనను ప్రపంచ స్థాయి 2024 వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సత్తుపల్లి కి చెందిన గౌరీ శంకర్ పేరు ఉంది అంటే..అందుకు పెన్సిల్ కారణం అంటున్నాడు.

Pencil

ఒక పెన్సిల్ పై తను పెంచుకున్న అనుభందం యువకుడిని ప్రపంచానికి పరిచయం చేసిందని స్థానికులు శంకర్‌కు అభినందనలు చెబుతున్నారు. పెన్సిల్ కు జీవం లేకపోయినా….ఒక లక్ష్యం కోసం నిరంతరం తపిస్తున్న ఆ యువకుడి చేతిలో ఒక పెన్సిల్ కూడా లక్ష్య సాధన కోసం ఉపయోగపడే ఆయుధంగా మారి ఆ యువకుడి కి విజయానికి కారణమైందని పలువురు ప్రశంసలు కురిపించారు. అలా….సత్తుపల్లి కి చెందిన మైక్రో ఆర్టిస్టు గౌరీ శంకర్ వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2024లో పేరు సంపాదించడానికి…ఒక పెన్సిల్ కూడా కారణం అయ్యిందని, ఆ పెన్సిల్ ..ఆ యువకుని కోరిక తీర్చిందని…సత్తుపల్లి ప్రాంతం లోని ప్రముఖులు మైక్రో ఆర్టిస్టు గౌరీ శంకర్ ను అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.