సర్కారు బడిలో ఖాళీ మద్యం సీసాలు..

అది పేరుకు మాత్రం సర్కారీ పాఠశాల.. కానీ అక్కడ జరిగేవన్నీ అసాంఘిక కార్యక్రమాలే. ఈ స్కూలు మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. ఖాళీ చేసిన మందు సీసాలు చిన్నారుల చేతుల్లో ఆటవస్తువులుగా దర్శనిస్తాయి. ఇదీ వరంగల్ జిల్లా భూక్యా తండా ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూస్తున్న చోద్యం . దీని గురించి స్కూలు ఉపాధ్యాయుడ్ని ప్రశ్నిస్తే .. తమ పాఠశాలలో ఇలా ఎన్నడూ జరగదని, ఇక్కడ రోడ్డు పనులుచేస్తున్నకార్మికులే మద్యం తాగి సీసాలు వదిలి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. […]

సర్కారు బడిలో ఖాళీ మద్యం సీసాలు..
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2019 | 2:14 PM

అది పేరుకు మాత్రం సర్కారీ పాఠశాల.. కానీ అక్కడ జరిగేవన్నీ అసాంఘిక కార్యక్రమాలే. ఈ స్కూలు మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. ఖాళీ చేసిన మందు సీసాలు చిన్నారుల చేతుల్లో ఆటవస్తువులుగా దర్శనిస్తాయి. ఇదీ వరంగల్ జిల్లా భూక్యా తండా ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూస్తున్న చోద్యం . దీని గురించి స్కూలు ఉపాధ్యాయుడ్ని ప్రశ్నిస్తే .. తమ పాఠశాలలో ఇలా ఎన్నడూ జరగదని, ఇక్కడ రోడ్డు పనులుచేస్తున్నకార్మికులే మద్యం తాగి సీసాలు వదిలి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే స్కూలు ముగిసిన తర్వాత ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు.