Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు బిగ్ షాక్.. ఆ హోటల్‌ను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు..

|

Nov 13, 2022 | 7:28 PM

ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక నిందితుడు అయిన నందకుమార్‌కు బిగ్ షాక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్...

Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు బిగ్ షాక్.. ఆ హోటల్‌ను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు..
Ghmc
Follow us on

ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక నిందితుడు అయిన నందకుమార్‌కు బిగ్ షాక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్‌లోని కొంత భాగాన్ని కూల్చివేశారు అధికారులు. అక్రమ నిర్మాణం పేరుతో ఈ చర్యకు ఉపక్రమించారు జీహెచ్ఎంసీ అధికారులు. హోటల్‌లోని కొంత భాగం అక్రమంగా నిర్మించారని, దీనికి సంబంధించి ఇదివరకే నోటీసులు అందజేశారు అధికారులు. దీనిపై నందకుమార్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో అధికారులు కూల్చివేత చేపట్టారు. తాము పంపిన నోటీసులకు స్పందించలేదని, అందుకే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని జీహెఎచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.

అయితే, ఆదివారం నాడు సెలవు అయినప్పటికీ.. అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతకు దిగడం విమర్శలకు దారి తీసింది. ఆదివారం రోజు హోటల్‌ను ఎలా కూరుస్తారంటూ అధికారులను ప్రశ్నించారు నందకుమార్ భార్య చిత్రలేఖ. గతంలో నోటీసులు ఇస్తే లీజు అగ్రిమెంట్ చూపించామని అంటున్నారు. ఈ లీజుపై దగ్గుబాటి ఫ్యామిలీ ఫిర్యాదు చేసిందని, అందుకే ఆదివారం పూట కూల్చివేస్తున్నారని మండిపడ్డారామె. ఈ ప్రశ్నలు, విమర్శలపై స్పందించిన అధికారులు క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ఆదివారాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని గుర్తు చేశారు అధికారులు.

ఇకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభాలకు గురి చేస్తూ నందకుమార్ సహా మరో ఇద్దరు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..