నిజామాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రచ్చ.. నామినేషన్ వేసిన కోటగిరి శ్రీనివాస్‌పై ఫోర్జరీ ఆరోపణలు

ఇక్కడ కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి నామినేషన్ వేశాడు. కానీ అది ఇద్దరు ప్రజాప్రతినిధుల సంతకాలను ఫోర్జరీ చేసి.. వాళ్లు ప్రతిపాదించినట్లుగా నామినేనన్..

నిజామాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రచ్చ.. నామినేషన్ వేసిన కోటగిరి శ్రీనివాస్‌పై ఫోర్జరీ ఆరోపణలు
Nizamabad Local Body Mlc Po

Nizamabad local body MLC polls: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్‌లో ఓ రచ్చ జరగుతోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ పోటీలో లేదు. పైగా టీఆర్‌ఎస్‌కి ఫుల్‌ మెజార్టీ. సో.. కల్వకుంట్ల కవిత నామినేషన్ ఏకగ్రీవం అవుతుందని.. వార్ ఉండదు.. కారు వన్‌సైడ్‌ అవుతుందనుకున్నారంతా.. కానీ.. ఇక్కడ కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి నామినేషన్ వేశాడు. కానీ అది ఇద్దరు ప్రజాప్రతినిధుల సంతకాలను ఫోర్జరీ చేసి.. వాళ్లు ప్రతిపాదించినట్లుగా నామినేనన్ దాఖలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించి నందిపేట్ MPTC నవణీత, నిజామాబాద్ సిటీలోని 31 డివిజన్ MIM కార్పొరేటర్‌ గజియా సుల్తానా తన ఫోర్జరీ సంతకాలపై ఫిర్యాదు చెయ్యబోతున్నారు.

ఒకవేళ ఈ నామినేషన్ వాళ్లిద్దరి సంతకాల ఫోర్జరీతో జరిగిందని తేలితే.. ఇవాళ పరిశీలనలో శ్రీనివాస్ పత్రాలను రిజెక్ట్ చేస్తారు. అప్పుడు కవిత ఏకగ్రీవం అవుతారు. ఇంతకీ ఫోర్జరీ జరిగిందా లేదా..? ఇంతా రచ్చ తర్వాత శ్రీనివాస్ అసలు బరిలో ఉంటాడా..? ఫిర్యాదు ఏమని చెయ్యబోతున్నారు.. కాసేపట్లో తేలిపోతుంది.

ఇవి కూడా చదవండి: ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..

Click on your DTH Provider to Add TV9 Telugu