ఆ ప్రాజెక్టులో తగ్గుతునన నీటినిల్వలు.. ఆందోళనలో రైతులు.. అసలు కారణం ఇదే..

ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయనిగా నిలుస్తున్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ పూడికతో నిండుకుంటోంది. ప్రతీ ఏడాది ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టులో పూడిక పేరుకపోతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో జూరాలపై ఆధారపడిన ఉమ్మడి జిల్లాకు త్రాగు, సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూరాల ప్రాజెక్ట్‎లో పూడిక ఉమ్మడి మహబూబ్‎నగర్ జిల్లా ప్రజలకు శాపంగా మారుతోంది. జలాశయం ప్రధాన క్రస్ట్ గేట్ల దిగువన స్లూయిజ్‎లు లేకపోవడంతో ప్రతీ సంవత్సరం పూడిక పేరుకుపోతోంది.

ఆ ప్రాజెక్టులో తగ్గుతునన నీటినిల్వలు.. ఆందోళనలో రైతులు.. అసలు కారణం ఇదే..
Jurala Project
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 30, 2024 | 3:04 PM

ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయనిగా నిలుస్తున్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ పూడికతో నిండుకుంటోంది. ప్రతీ ఏడాది ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టులో పూడిక పేరుకపోతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో జూరాలపై ఆధారపడిన ఉమ్మడి జిల్లాకు త్రాగు, సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూరాల ప్రాజెక్ట్‎లో పూడిక ఉమ్మడి మహబూబ్‎నగర్ జిల్లా ప్రజలకు శాపంగా మారుతోంది. జలాశయం ప్రధాన క్రస్ట్ గేట్ల దిగువన స్లూయిజ్‎లు లేకపోవడంతో ప్రతీ సంవత్సరం పూడిక పేరుకుపోతోంది. దీంతో జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యంపై ఈ భారం పడుతోంది. ఈ కారణంగా నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో అటూ త్రాగు, ఇటు సాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోంది ఈ జలప్రదాయని.

1995లో ప్రారంభమైన జూరాల జలాశయం వాస్తవంగా గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. పూడిక కారణంగా డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని 2013లో 9.657టీఎంసీలకు సాగునీటి శాఖ అధికారులు తగ్గించారు. దీని కారణంగా జలశయంలో నీటి నిల్వ 2.283టీఎంసీల మేర తగ్గిపోయింది. నీటి నిల్వకు డ్యాంలో లోటు ఏర్పడడంతో పాటు వరదలు వచ్చే సమయంలో జలాల ఎత్తిపోతలకు కూడా ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ప్రస్తుతం జూరాలలో మరోసారి పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోయింది. ఎగువన నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్ట్‎లో ప్రతి ఏడాది పూడిక వచ్చి చేరుతోంది. మరోసారి ప్రాజెక్ట్‎లో పూడికపై అధికారులు సమీక్ష చేస్తే మళ్లీ నీటినిల్వ సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‎లో సుమారు 2 టీఎంసీలకుపైగా సామర్థ్యం తగ్గగా మళ్లీ మరో 2-3టీఎంసీల నీటినిల్వ తగ్గిస్తే త్రాగు, సాగు అవసరాలపై పెను ప్రభావం పడనుంది.

నీటి పారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఒక టీఎంసీ నీటినిల్వతో ఒక పంటకు పదివేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. దీంతో ప్రతి పదేళ్లకు ఒకసారి పూడిక సమస్య కారణంగా గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం తగ్గించాల్సి వస్తే రానున్న రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. గతేడాది ఏకంగా జూరాల ఆయకట్టు సాగుకు రబీలో క్రాప్ హాలీడ్ ప్రకటించాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటోంది. సాగు, తాగు నీటి అవసరాలను తీర్చుతున్న ఇంత పెద్ద జలాశయం మనుగడకు పూడిక ముప్పు కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..
Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?