Etela Rajendar: పాదయాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అస్వస్థత.. చికిత్స అందిస్తున్న వైద్యులు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 30, 2021 | 6:30 PM

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, గత రెండు రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Etela Rajendar: పాదయాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అస్వస్థత.. చికిత్స అందిస్తున్న వైద్యులు
Etela Rajender Is Ill

Etela Rajendar is Illness: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, గత రెండు రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈటల రాజేందర్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో వీణవంక మండలం కొండపాక వరకూ నడిచి మధ్యాహ్న భోజనమే ఈటల రాజేందర్ తన పాదయాత్రను ముగించారు. ఈటల రాజేందర్‌కు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం వైద్యుల సంరక్షణ లో ఉన్న ఈటల రాజేందర్‌కు గత రెండు రోజులుగా కాళ్లకు పొక్కులు, తీవ్రమైన జ్వరం వేదిస్తుండటంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పాదయాత్ర కు మూడు, నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గత వారం రోజులుగా లంచ్ బ్రేక్ లో వైద్యులు ఈటల రాజేందర్‌కు చికిత్స అందిస్తుండగా, కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించారు.

అయితే, షెడ్యూల్ ప్రకారం రెండు గ్రామాల్లో ఈటల రాజేందర్ కు బదులు ఆయన సతీమణి ఈటల జమున పాదయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బిజేపి నేతలు. ఈటల జమున ఇవాళ్టి నుంచి పాదయాత్ర మొదలు పెడతారా? లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా కాళ్లకు పొక్కులు రావడం , స్వల్పంగా దగ్గు జలుబు కావడంతో అస్వస్థతకు గురైనట్లు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. పాదయాత్రలో పూర్తిగా డి హైడ్రేట్ అయిపోయారని, వైద్యులు ఇచ్చిన సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు. ఇక అటు బీజేపీ తో పాటు గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది.

Read Also… 

AP Corona Case: ఏపీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. ఐదు జిల్లాల్లో వందలోపే.. మిగిలిన చోట్ల మారని తీరు!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu