
>>లోటు వర్షపాతంతో 11.18 లక్షల ఎకరాల్లో పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. >>కావల్సినన్ని నీళ్లు లేక ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి చేలు నాశనమయ్యాయి. >>కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 270 టీఎంసీలైతే, ఇప్పటికున్నది 78.5 టీఎంసీలే. అంటే, 70 శాతం లోటున్నట్టు. >>గోదావరి బేసిన్ రిజర్వాయర్లలో 96 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇది 34 శాతం లోటు. >>29.91 టీఎంసీల నీళ్లుండాల్సిన సింగూరు డ్యామ్లో 4 టీఎంసీలే ఉన్నాయి. అవి కూడా డిసెంబరు వరకే..! >>రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో పావు వంతు కన్నా తక్కువ నీరే ఉంది..! >>నీటి సంక్షోభం అంచుకు చేరింది భాగ్యనగరం..! ఇప్పుడు 14.5 లక్షల నల్లా కనెక్షన్ల నుంచి కోటీ 30 లక్షల మందికి నీళ్లిస్తోంది జల మండలి. కానీ, భవిష్యత్తులో 4 లక్షల నల్లాల్లో నీళ్లే రాకపోవచ్చు. అంటే మూడో వంతు హైదరాబాద్కు నీళ్ల కటకట తప్పదు. ఇదీ క్లుప్తంగా రాష్ట్రంలో కరవు పరిస్థితి. సంబంధిత మంత్రిత్వ శాఖలన్నీ కలిసి మండలాలనుంచి రిపోర్ట్ తెప్పించుకుని పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి. సమస్య ఇదీ, పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో లేదని తేల్చేశాయి. గురువారం రివ్యూ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ వార్నింగ్ ఇవ్వడంతో అన్ని డిపార్ట్మెంట్లూ ఎటెన్షన్లోకి వచ్చాయి....