‘ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది’.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

రాష్ట్రంలోని జాతీయ రహదారుల సహా అనేక అంశాలపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి గడ్కరీతో చర్చించినట్టు తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రీజనల్ రింగ్‌ రోడ్‌, హైదరాబాద్- విజయవాడ రహదారిని ఆరు లేన్లుగా మార్చే అంశంపై గడ్కరీతో చర్చించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి పలు అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందించాలని గడ్కరీని కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క తెలిపారు.

'ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది'.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Deputy Cm Batti Vikramarka
Follow us

|

Updated on: Jun 26, 2024 | 4:58 PM

రాష్ట్రంలోని జాతీయ రహదారుల సహా అనేక అంశాలపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి గడ్కరీతో చర్చించినట్టు తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రీజనల్ రింగ్‌ రోడ్‌, హైదరాబాద్- విజయవాడ రహదారిని ఆరు లేన్లుగా మార్చే అంశంపై గడ్కరీతో చర్చించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి పలు అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందించాలని గడ్కరీని కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు ఒక వరంగా మారుతుందని చెప్పారు. కేంద్రం స్పందించిన తీరుపై తాను సంతోషిస్తున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

విజయవాడ-నాగ్ పూర్ హైవేతో పాటు ఇతర రింగ్ రోడ్డుల విస్తరణ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. వీటితో పాటు సర్వీస్ రోడ్లు, గ్రామాలకు సంబంధించిన క్రాసింగ్ రోడ్లపై కూడా సానుకూలంగా స్పందించినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ – కల్వకుర్తి కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర రోడ్లు, రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వీటన్నింటితో పాటు రాష్ట్రానికి రావల్సిన నిధులు, కేంద్ర విద్యాసంస్థలకు సంబంధించిన వాటిని కూడా అడిగినట్లు తెలిపారు. కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలకు సంబంధించి అన్ని సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తామని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…