MLC By Election: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్ పర్సంటేజ్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం ?

చెదురు మదురు ఘటనలు మినహా.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈసారి పట్టభద్రులు ఓటేసేందుకు వెనకడుగు వేశారు. దాంతో ఊహించని విధంగా పోలింగ్ శాతం తగ్గడం అభ్యర్థులను కలవరపెడుతోంది. తగ్గిన పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం ?

MLC By Election: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్ పర్సంటేజ్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం ?
Theenmar Mallanna Premandar Reddy Rakesh Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 28, 2024 | 9:10 AM

చెదురు మదురు ఘటనలు మినహా.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈసారి పట్టభద్రులు ఓటేసేందుకు వెనకడుగు వేశారు. దాంతో ఊహించని విధంగా పోలింగ్ శాతం తగ్గడం అభ్యర్థులను కలవరపెడుతోంది. తగ్గిన పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం ? … విద్యావంతులు ఎవరికి పట్టం కట్టారనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సాధారణ ఎన్నికలను తలపించేలా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. చిన్న చిన్న చెదురుముదురు ఘటనలు మినహా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే మునుపటి ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఉప ఎన్నికలో పోలింగ్ పర్సంటేజ్‌ తగ్గింది. పట్టబద్రులు ఓటరు నమోదు చేసుకోవడంలోను కొంత అలసత్వం వహించారు. ఊహించని విధంగా పోలింగ్ శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.

2021లో పట్టభద్రుల ఎన్నికలు జరగగా 5 లక్షల5 వేల565 ఓటర్లకు గాను 3లక్షల 87 వేల 989 మంది గ్రాడ్యుయేట్స్ వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు 76.73శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి సాయంత్రం 4 గంటల వరకు 68.65 శాతం పోలింగ్‌ నమోదైంది. 4 గంట‌ల్లోపు క్యూలైన్ల‌లో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవ‌కాశం క‌ల్పించారు. ఈసారి మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్ 72.37 % నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 12 వేల 806 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈసారి ఉప ఎన్నికల్లో కొత్తగా మళ్లీ పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో లాస్ట్ టైం కంటే తక్కువ మంది 4 లక్షల 63 వేల 839 మంది పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకున్నారు. అటు పోలింగ్ విషయంలో చేతులెత్తేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల బిజీలో పడ్డ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోలేదు. ఉమ్మడి వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్లగొండ జిల్లాల ప‌రిధిలోని 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొన‌సాగింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు.

గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ పర్సంటేజ్‌ తగ్గడం కొందరి అభ్యర్థులను కలవర పెడుతుంటే.. మరికొందరిలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. నమోదైన పోలింగ్ పై అభ్యర్థులు ఎవరిపాటికి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన క్షణం నుంచి పోలింగ్ పర్సంటేజ్ తగ్గడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లే తరలివచ్చి ఓటు హక్కు సద్వినియం చేసుకున్నారని.. ఆ ఓటు కచ్చితంగా తన విజయానికి దోహదపడుతుందని బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసంతో విద్యావంతులు తనను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే శాసన మండలకి పంపుతారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

అటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా గెలుపు విశ్వాసంతో ఉన్నారు. తనలాంటి విద్యావంతుని ప్రశ్నించే గొంతుకను శాసనమండలికి పంపడం కోసం విద్యావంతులంతా కంకణం కట్టుకున్నారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే తనకు పట్టం కడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ అనుకూల ఓట్లే దాదాపుగా నమోదయాయని అవి తన విజయానికి దోహదపడతాయని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ధీమాతో ఉన్నారు. ఓటర్లు తనకు మద్దతుగా నిలిచారని కాన్ఫడెన్స్ వ్యక్తం చేశారు.

ఓవైపు లాస్ట్‌టైం కంటే పోలింగ్ పర్సెంటేజ్‌ తగ్గడంతో.. పట్టభద్రులు ఈసారి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపును జూన్‌ 5న చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…