మూగజీవాలను కోల్పోయి..అన్నదాత ఆక్రందన

అవి ఆవులు మాత్రమే కాదు..అన్నదాతల్లో అర్థభాగం. కష్టంలో రైతుకు నిత్యం తోడుండేవి అవి మాత్రమే. జంతు జాతికి చెందినా.. మనుషులుకు అత్యంత సేవ చేసే వాటిలో అవి ముందుంటాయి. కొంతమంది వాటిని కుటుంబంతో సమానంగా చూసుకుంటారు. అంత ప్రేమగా చూసుకున్న వాటిని పిడుగు దూరం చెయ్యడంతో.. ఓ రైతు రోదన చూపరుల హృదయాలను కదిలించివేసింది. వానొచ్చింది..ఇక కాడి కట్టి విత్తు వేయాలనుకున్న ఆ రైతు ఆనందం ఆ వర్షంతోనే ఆవిరైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ […]

మూగజీవాలను కోల్పోయి..అన్నదాత ఆక్రందన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 24, 2019 | 10:23 AM

అవి ఆవులు మాత్రమే కాదు..అన్నదాతల్లో అర్థభాగం. కష్టంలో రైతుకు నిత్యం తోడుండేవి అవి మాత్రమే. జంతు జాతికి చెందినా.. మనుషులుకు అత్యంత సేవ చేసే వాటిలో అవి ముందుంటాయి. కొంతమంది వాటిని కుటుంబంతో సమానంగా చూసుకుంటారు. అంత ప్రేమగా చూసుకున్న వాటిని పిడుగు దూరం చెయ్యడంతో.. ఓ రైతు రోదన చూపరుల హృదయాలను కదిలించివేసింది. వానొచ్చింది..ఇక కాడి కట్టి విత్తు వేయాలనుకున్న ఆ రైతు ఆనందం ఆ వర్షంతోనే ఆవిరైపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం వెన్నారం గ్రామంలో రామ్మూర్తి అనే రైతు తన సొంత బిడ్డల్లా చూసుకునే రెండు దుక్కిటి ఆవులను తీసుకుని ఆదివారం పొలానికి వెళ్లి అరక కట్టారు. పంటను కోతుల నుంచి కాపాడేందుకు కొన్న కొండముచ్చును కూడా తీసుకెళ్లారు. ఈలోగా వర్షం పడటంతో ఆవులను పొలంలోని చెట్టు కిందికి తీసుకెళ్లారు. ఊహించని రీతిలో పిడుగు పడి ఆవులు సహా కొండముచ్చు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ రైతు నిర్జీవంగా ఉన్న మూగజీవాలను చూసి చలించిపోయాడు. ఆ కుటుంబం మొత్తం వాటిని హత్తకుని కన్నీళ్లు పెట్టింది. ఆ దృశ్యం అక్కడ ఉన్నవాళ్ల మనసులను కదిలించింది. ఇన్నాళ్లూ తమ కుటుంబాన్ని పోషించిన ఆవులు తన పొలంలోనే ఉండాలని రామ్మూర్తి వ్యవసాయ భూమిలోనే వాటి మృతదేహాలను ఖననం చేశారు.