Telangana Students: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్‌లో పాస్‌ మార్కులు వస్తే అన్ని ప్రవేశాలకు అర్హులే

తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త.. వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించింది. కరోనా నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Students: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్‌లో పాస్‌ మార్కులు వస్తే అన్ని ప్రవేశాలకు అర్హులే
Students
Follow us

|

Updated on: Aug 23, 2021 | 5:25 PM

Telangana Entrance Exams: తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత చదువులకు సంబంధించి ఎంసెట్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఐదేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్‌ పొందాలంటే ఇంటర్ తత్సమాన కోర్సుల్లో మినిమం పాస్ అయితే చాలు అని పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు జరగకపోవడం, విద్యార్థులకు పాస్‌ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కాగా అధికారులతో సమావేశమైన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఈ అంశమై చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇంటర్‌ మార్క్స్‌ కచ్చితంగా ఇన్ని మార్కులు ఉండాలనే నిబంధన ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పాస్‌ మార్కులు వస్తే చాలు.. ప్రవేశాలు పొందే వీలు కల్పించింది. వృత్తి విద్యాకోర్సుల్లో చేరేందుకు రాష్ట్రంలో 7 రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్‌డ్‌ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉండేది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే గతంలో సాధించిన మార్కులు.. లేదంటే కనీస మార్కులతో పాస్‌ చేశారు. కనీస మార్కుల నిబంధనతో వీరంతా ప్రవేశాలు పొందే అర్హతను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పాస్‌ మార్కులతోనే ప్రవేశాలు పొందేందుకు వీలుగా అధికారులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. కనీస మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం అన్నిరకాల కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు వీలు కలగనున్నది.

Read Also…  Aradhana Mahotsav: ఘనంగా జరుగుతున్న రాఘవేంద్రస్వామి 350వ ఆరాధనోత్సవాలు.. ఆ రాయరు అనుగ్రహం కోసం పూజలు

Honey Trap: అర్ధనగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్.. అందినకాడికి దండుకుంటున్న ముఠా.. పోలీసుల ఏంట్రీతో..

Viral Photos: ఇండియాలో ఉన్న పువ్వుల లోయ గురించి మీకు తెలుసా..! స్వర్గానికి తక్కువేమి కాదు..