దంపతుల ప్రాణం తీసిన క్షణికావేశం.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం..!

ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కట్టుకున్న భార్యతో కలిసి ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్షణికావేశంలో వారు తీసుకున్న ఈ నిర్ణయం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

దంపతుల ప్రాణం తీసిన క్షణికావేశం.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం..!
Ghatkesar Railway Station Crime

Updated on: Jul 03, 2026 | 11:04 AM

ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కట్టుకున్న భార్యతో కలిసి ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్షణికావేశంలో వారు తీసుకున్న ఈ నిర్ణయం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్ (32), శిరీష (28) దంపతులు. గత కొంతకాలంగా వీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందారు. ఈ క్రమంలోనే గురువారం (జూలై 02) రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని, వేగంగా వస్తున్న రైలు కిందపడి ప్రాణాలు విడిచారు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా వారు వరంగల్ జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించి, సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేశారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందులే ఈ ఘోరానికి ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రవికుమార్, శిరీషల అకాల మరణంతో వారి సొంత గ్రామమైన పాపయ్యపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us