MLC Kavitha: సుఖేష్‌ చంద్రశేఖర్ మరో సంచలనం.. కవితతో జరిపిన చాట్ ఇదే అంటూ స్క్రీన్ షాట్స్ విడుదల

సుఖేష్‌ చంద్రశేఖర్ మరో సారి సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. ఎమ్మెల్సీ కవితతో జరిపిన సంభాషణ అంటూ చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు సుఖేష్‌ లాయర్‌. అక్కా అంటూ తెలుగులో జరిపిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వివరాలు....

MLC Kavitha: సుఖేష్‌ చంద్రశేఖర్ మరో సంచలనం.. కవితతో జరిపిన చాట్ ఇదే అంటూ స్క్రీన్ షాట్స్ విడుదల
MLC Kavitha

Edited By:

Updated on: Apr 12, 2023 | 3:05 PM

ఢిల్లీ మండోలి జైల్లో ఉన్న మాయగాడు ఈసారి చాటింగ్‌ బాంబ్‌ పేల్చాడు. ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సప్‌ చాట్‌ ఇదేనంటూ పలు స్క్రీన్ షాట్స్ విడుదల చేశాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. తెలుగు రాని సుఖేశ్‌  అక్కడక్కడా తెలుగు పదాలతో చాట్‌ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కా అంటూ పలుమార్లు చాట్‌లో సంభోధించాడు సుఖేశ్‌. డబ్బు డెలివరీ చేశానంటూ వాట్సప్‌ చాట్‌లో పేర్కొన్నాడు సుఖేశ్‌. స్పోకెన్‌ టూ మనీష్‌ అని రిప్లై కూడా ఇచ్చాడు.

గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ . కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ ఆదేశాలపై హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్‌ రామచంద్ర పిళ్లై ద్వారా డబ్బులు అందచేసినట్టు లేఖలో పేర్కొన్నారు.

మనీలాండరింగ్‌ కేసులో మండోలి జైలులో ఉన్నాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సుఖేశ్‌ ఆప్‌ నేతలపై సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం కేజ్రీవాల్‌కు వందల కోట్ల ముట్టజెప్పినట్టు ఆరోపించాడు.

Chat

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us