CM Revanth Reddy: హైదరాబాద్‌లో మరో కొత్త కమిషనరేట్‌.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఫ్యూచర్ సిటీలో కొత్తగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్‌ను సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న పలు కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరిశీలించారు.

CM Revanth Reddy: హైదరాబాద్‌లో మరో కొత్త కమిషనరేట్‌..  ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy Inaugurates Police Commissionerate

Updated on: Oct 19, 2026 | 9:20 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సోమవారం ఫ్యూచర్ సిటీలో కొత్తగా త్తగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్‌ను అధికారికంగా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఫ్యూచర్‌ సిటీ CP తరుణ్‌ జోషిని కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌తోపాటు.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.

ఆ తర్వాత.. విద్యా, పట్టణ ప్రణాళికా రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం. అనంతరం ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానంగా.. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని సందర్శించి.. నిర్మాణ పనులను ఆరా తీశారు. యూనివర్సిటీ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి?.. మౌలిక వసతుల కల్పనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

యూనివర్సిటీ ప్రాంగణంలోనే నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మరోవైపు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) క్యాంపస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆధునిక పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కొనే సాంకేతిక నిపుణులను, అర్బన్ ప్లానర్లను తీర్చిదిద్దడంలో ఈ క్యాంపస్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఆయా కార్యక్రమాల తర్వాత.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ నెట్‌వర్క్ లాంటి మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడుల ఆకర్షణ, భూసేకరణ పురోగతిపై చర్చించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us