Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌.. శాసనసభలో భట్టి, కౌన్సిల్‌లో శ్రీధర్‌బాబు

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్‌ సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్‌ సమావేశమై.. తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలుపనుంది.

Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌.. శాసనసభలో భట్టి, కౌన్సిల్‌లో శ్రీధర్‌బాబు
Telangana Budget 2024
Follow us

|

Updated on: Jul 25, 2024 | 7:55 AM

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్‌ సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్‌ సమావేశమై.. తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత.. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్ధికమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనునుండగా.. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభకు ఒకరోజు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. అటు.. 28న ఆదివారం, 29న హైదరాబాద్‌లో బోనాల పండుగ నేపథ్యంలో వరుసగా రెండు రోజులు సెలవు ఉంటుంది. మంగళవారం తర్వాత ఈ నెల 30, 31 తేదీల్లో పద్దులపై చర్చించి.. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అయితే.. ఎన్నికల్లో భారీ ఎత్తున పథకాలు, అభివృద్ధి పనులకు కాంగ్రెస్‌ హామీలు ఇచ్చింది. అయితే.. ఓ వైపు కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్న రేవంత్‌ సర్కార్‌.. తెలంగాణలోని స్కీమ్స్‌కు రాష్ట్ర బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయింస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.

ఇదిలావుంటే.. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో కాంగ్రెస్‌ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం.. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని పదేపదే సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానుండడంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి నెలకొంది. నిబంధనలు ఫాలో అవుతూ.. కాంగ్రెస్‌ విమర్శలకు కేసీఆర్‌ చెక్‌ పెట్టబోతున్నారా?.. అసలు.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నారు?.. అనే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తంగా.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓటాన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకురానుంది. ఎన్నికల్లో పెద్దయెత్తున హామీలు ఇచ్చిన నేపథ్యంలో బడ్జెట్‌పై అంచనాలు భారీ ఉన్నాయి. అదేసమయంలో కేసీఆర్‌ సభకు హాజరుకానుండడంతో ఈ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..