Revanth Reddy: వీరికి రిజర్వేషన్లు ఇవ్వని యూనివర్సిటీలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. కీలక ఆదేశాలు

రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని సమీక్షలో తెలిపారు.

Revanth Reddy: వీరికి రిజర్వేషన్లు ఇవ్వని యూనివర్సిటీలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. కీలక ఆదేశాలు
Cm Revanth Reddy
Follow us

| Edited By: Srikar T

Updated on: Dec 30, 2023 | 11:04 PM

రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని సమీక్షలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయంబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మౌళికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా అందిస్తున్నాయో నివేదిక ఇవ్వాలన్నారు. ఇండ్ల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ అయిన భూములను ధరణిలో చూపించినా ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతి ఇచ్చారని, అలాంటి వాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ఇండ్ల స్థలాల కింద చూపించి వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను తయారు చేయాలని అధికారులను కోరారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు