Telangana Jobs: 80వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన.. జోన్లు, మల్టీ జోన్లు, శాఖలవారీగా ఖాళీల వివరాలు ఇవే..

|

Mar 09, 2022 | 11:31 AM

నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీపికబురు అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.

Telangana Jobs: 80వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన.. జోన్లు, మల్టీ జోన్లు, శాఖలవారీగా ఖాళీల వివరాలు ఇవే..
Cm Kcr
Follow us on

CM KCR announces Jobs Notification: నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీపికబురు అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..

గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9,168 పోస్టులు

క్యాడర్ వారీగా ఖాళీలు..

జిల్లాల్లాలో – 39,829
జోన్లలో – 18,866
మల్టీజోనల్‌ పోస్టులు – 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో – 8,147

జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్ – 5,268
నిజామాబాద్ – 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి – 1,769
రంగారెడ్డి – 1,561
కరీంనగర్ – 1,465
నల్లగొండ – 1,398
కామారెడ్డి – 1,340
ఖమ్మం – 1,340
భద్రాద్రి కొత్తగూడెం – 1,316
నాగర్‌కర్నూల్ – 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్ – 1,193
సిద్దిపేట – 1,178
మహబూబాబాద్ – 1,172
హనుమకొండ – 1,157
మెదక్ – 1,149
జగిత్యాల – 1,063
మంచిర్యాల – 1,025
యాదాద్రి భువనగిరి – 1,010
జయశంకర్ భూపాలపల్లి – 918
నిర్మల్ – 876
వరంగల్ – 842
కుమ్రం భీం ఆసీఫాబాద్ – 825
పెద్దపల్లి – 800
జనగాం – 760
నారాయణపేట్ – 741
వికారాబాద్ – 738
సూర్యాపేట – 719
ములుగు – 696
జోగులాంబ గద్వాల – 662
రాజన్న సిరిసిల్ల – 601
వనపర్తి – 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

కాళేశ్వరం జోన్‌లో – 1,630
బాసర జోన్‌ – 2,328
రాజన్న జోన్‌ – 2,403
భద్రాద్రి జోన్‌ – 2,858
యాదాద్రి జోన్‌ – 2,160
చార్మినార్ జోన్‌ – 5,297
జోగులాంబ జోన్‌ – 2,190

మల్టీజోన్లు..

మల్టీజోన్ 1 – 6,800
మల్టీజోన్ 2 – 6,370

ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు..

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.

శాఖల వారీగా ఖాళీల వివరాలు..

హోం శాఖ – 18,334
సెకండరీ ఎడ్యుకేషన్ – 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ – 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్ – 7,878
బీసీల సంక్షేమం – 4,311
రెవెన్యూ శాఖ – 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ – 2,879
నీటిపారుదల శాఖ – 2,692
ఎస్టీ వెల్ఫేర్ – 2,399
మైనారిటీస్ వెల్ఫేర్ – 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ – 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ – 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్ – 1,221
ఆర్థిక శాఖ – 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ – 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ – 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్ – 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ – 563
న్యాయశాఖ – 386
పశుపోషణ, మత్స్య విభాగం – 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్ – 343
ఇండస్ట్రీస్, కామర్స్ – 233
యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ – 184
ప్లానిం గ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్ – 106
లెజిస్లేచర్ – 25
ఎనర్జీ – 16