
హైదారబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను, సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.
చాలా క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి.. అద్భుతంగా సేవ చేస్తున్నారు. మీరు చేస్తున్న సేవలను ఇలాగే కొనసాగించండి. మీకు ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించండి అని గాంధీ వైద్య సిబ్బందిని ప్రశంసించారు సీఎం కేసీఆర్.
గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారు అంటూ అభినందించారు.
కోవిడ్ బాధితులతో ఆయన చాలా దగ్గరగా మాట్లాడారు. చికిత్స సరిగ్గా అందుతోందా …అని ఓ బాధితుడిని ప్రశ్నించారు. భోజనం ఎలా ఉందని కూడా అడిగారు.
గాంధీలోని అత్యవసర విభాగంలో సీఎం కేసీఆర్ సందర్శించారు. అక్కడ కోవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భరోసా కల్పించారు.
గాంధీ ఆస్పత్రిలోని కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నవారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరామర్శించినట్లుగా తెలంగాణ సీఎంవో ఓ ట్వీట్ చేసింది.. ఇందులో సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో పర్యటిస్తున్న వీడియోను షేర్ చేసింది,
రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు.
ఆక్సిజన్, ఔషధాల కొరత రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తొలిసారిగా కేసీఆర్ సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. స్వయంగా కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని పరిశీస్తున్నారు. అనంతరం గచ్చిబౌలి టిమ్స్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
గాంధీ ఆస్పత్రిలో సుమారు 18 వందలకుపైగా బెడ్లు ఉన్నాయి. కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లను సీఎం పరామర్శించి వసతులపై మాట్లాడారు.
చికిత్స, వసతులపై ముఖ్యమంత్రి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. అలాగే బాధితులతో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఆస్పత్రిలో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ వద్దే వైద్య ఆరోగ్యశాఖ ఉంది.ఈ నేపథ్యంలో ఆ శాఖ వ్యవహారాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి హరీశ్ రావు, సీఎంవో అధికారులు ఉన్నారు.
గాంధీలో కొవిడ్ ఎమర్జెన్సీ వార్డును పరిశీలించిన సీఎం… చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులను పరామర్శించారు. ఐసీయూలోని రోగులను పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్.. జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందించారు.
సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పర్యటించారు. కొవిడ్ చికిత్సలో కీలకంగా ఉన్న ఆస్పత్రిలో ఏర్పాట్లు, రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్సిజన్ వసతి, ఔషధాల సరఫరా తదితర అంశాలపై ఆరా తీశారు. 40 నిమిషాల పాటు గాంధీ ఆస్పత్రిలో సీఎం పర్యటించారు
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించి,