డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..

డీలిమిటేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ..బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రతిపాదించిన సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల 24 శాతం వాటాకు ఎలాంటి నష్టం కలగకుండా రక్షణ కల్పించడమే కాకుండా తెలంగాణ లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు పెరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
Brs To Support Delimitation Bill Says Ktr

Updated on: Nov 28, 2026 | 3:24 PM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా బీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డీలిమిటేషన్‌పై తమ పార్టీ వైఖరి మొదటి నుంచీ స్పష్టంగానే ఉందని కేటీఆర్ తెలిపారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకూడదని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల నష్టపోకూడదని, పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం వాటాను కచ్చితంగా కాపాడాలని స్పష్టం చేశారు.

తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదు

కేంద్రం తీసుకొచ్చిన తాజా ప్రతిపాదనలో అన్ని రాష్ట్రాల లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడంతో పాటు, రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు మార్చకుండా రక్షణ కల్పించడం తమ ప్రధాన ఆందోళనను పరిష్కరించిందని కేటీఆర్ వివరించారు. ఈ సవరణ వల్ల దక్షిణాది రాష్ట్రాల వాటాకు ఎలాంటి నష్టం కలగకపోగా, తెలంగాణలో లోక్‌సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరగనుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధి అని కేటీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగినా బీఆర్ఎస్ సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.

మహిళా రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై కూడా కేటీఆర్ స్పందిస్తూ.. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిందని, వాటి అమలుకు తమ పార్టీ పూర్తి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మరోవైపు, ఇండియా కూటమి పక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండగా, తమిళనాడు అధికార పక్షం డీఎంకే కూడా తాజా సవరణల నేపథ్యంలో బిల్లుకు మద్దతు ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us