అబ్బ.. పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. బోగత అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బోగత జలపాతాలు భారీ వరదతో మహోగ్రరూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జలపాతాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భద్రత దృష్ట్యా అటవీశాఖ, పోలీసులు జలపాతాల వద్ద పర్యాటకులను ఈత కొలనులోకి అనుమతించడం నిలిపివేసి, భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

అబ్బ.. పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. బోగత అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Bogatha Waterfalls

Edited By:

Updated on: Jul 21, 2026 | 11:48 AM

తెలంగాణ నయాగరా బోగత జలపాతాలు మహాగ్రరూపం రూపం దాల్చాయి.. జలపాతాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. అత్యంత ప్రమాదకరంగా మహానదిని తలపించే విధంగా జలపాతాల వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదాలు పొంచి ఉండడంతో జలపాతాల వద్ద ఈత కొలనులోకి అనుమతి నిరాకరించింది అటవీశాఖ.. ఈ ఏడాది ఇంత భారీగా వరద ఉప్పొంగడం ఇదే ప్రథమం.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో బోగత జలపాతాలకు వరద పోటెత్తింది.. బోగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. పోలీసులు, అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మార్గంలో భారీకేడ్స్ ఏర్పాటు చేశారు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రెండు రాష్ట్రాల సరిహద్దులోని జలపాతాలకు ఒకసారిగా వరద పోటెత్తింది.. దీంతో బొగత జలపాతాలు మహోగ్రరూపం దాల్చాయి.. ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. అనేక వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. జంపన్నవాగు , దెయ్యాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

వీడియో చూడండి..

ముఖ్యంగా బోగత జలపాతాలకు జలకళ సంతరించుకోవడంతో చాలా మంది.. పర్యాటకులు అందాలను వీక్షించేందుకు వస్తున్నారు. అయితే.. భారీ వర్షాలతో బోగత జలపాతాలకు వరద నీరు పోటెత్తడంతో.. అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో వారు నిరాశతో వెనుతిరుగుతున్నారు. వరద పోటెత్తడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని అటవీశాఖ సిబ్బంది, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరిస్థితులు చక్కబడే వరకు పర్యాటకులు అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us