Dharmapuri Arvind: రేవంత్ పై ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్ గామారిన కామెంట్స్

|

Apr 15, 2024 | 8:59 AM

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాలనుకుంటే స్వాగతిస్తామని బీజేపీ నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. రేవంత్ రెడ్డి చురుకైన నాయకుడని, ఆయన పార్టీలో చేరాలనుకుంటే మద్దతిస్తామని అర్వింద్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాలనుకుంటే స్వాగతిస్తామని బీజేపీ నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. రేవంత్ రెడ్డి చురుకైన నాయకుడని, ఆయన పార్టీలో చేరాలనుకుంటే మద్దతిస్తామని అర్వింద్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. “అతను నా స్నేహితుడు. ఆయన బీజేపీలో చేరాలనుకుంటే ఆయన పేరును పార్టీ అధిష్టానానికి సిఫారసు చేస్తా. అంతిమంగా ఆయనను పార్టీలో చేర్చుకోవాలా వద్దా అనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, రేవంత్ రెడ్డి ఆ పార్టీలో కొనసాగితే ఆయన భవిష్యత్తు నాశనమవుతుందని అర్వింద్ అన్నారు.

రేవంత్ రెడ్డి సమర్థుడైన నాయకుడని, కానీ కాంగ్రెస్ నేతలు ఆయనను స్వతంత్రంగా పనిచేయనివ్వరన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం పదిహేనేళ్లకు పైగా ఉండవచ్చు కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు తనకు కనిపించడం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాలనుకుంటే స్వాగతిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం అర్వింద్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే బీజేపీలోకి రేవంత్ అంటూ కేటీఆర్ కామెంట్స్ చేయడం కూడా అర్వింద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడేలా చేసింది.

Published on: Apr 15, 2024 08:56 AM