Baby Birth: నాలుగున్నర కిలోల బరువుతో జన్మించిన శిశువు.. ఆశ్యర్యపోతున్న వైద్యులు.. తల్లీబిడ్డ క్షేమం

Baby Birth: ఓ మహిళ నాలుగున్నర కిలోల శిశువుకు జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా జన్మించిన శిశువులు రెండు నుంచి మూడున్నర ...

Baby Birth: నాలుగున్నర కిలోల బరువుతో జన్మించిన శిశువు.. ఆశ్యర్యపోతున్న వైద్యులు.. తల్లీబిడ్డ క్షేమం

Updated on: Feb 13, 2021 | 9:38 AM

Baby Birth: ఓ మహిళ నాలుగున్నర కిలోల శిశువుకు జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా జన్మించిన శిశువులు రెండు నుంచి మూడున్నర కిలోల వరకు బరువు ఉంటారు. కానీ తాజాగా ఓ మహిళకు జన్మించిన శిశువు నాలుగున్నర కిలోలు ఉండటంతో ఆశ్యర్యపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సామిద్‌అలీఖాన్‌, నాజరీఖాన్‌ దంపతులు ఉపాధి నిమిత్తం కొన్ని రోజుల కిందట మంథనికి వచ్చారు. వీరికి ఇదివరకే ఇద్దరు పిల్లలున్నారు. మూడో కాన్పు సందర్భంగా మంథని ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. అయితే ఈ కాన్పులో సాధారణ ప్రసవం ద్వారా 4.5 కిలోల మగబిడ్డ జన్మించడం వైద్యులను ఆశ్యర్యానికి గురి చేసింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. నాజరీఖాన్‌కు గత రెండు కాన్పుల్లోనూ ఇద్దరు శిశువులు నాలుగు కిలోల బరువుతో జన్మించినట్లు వారు చెబుతున్నారు.

Walking: నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..? వాకింగ్‌ ఎలా చేయాలి.. ఎలాంటి ఉపయోగాలు..!

Loading...
Unable to load recommendations.
Follow Us