పెట్రోల్ కొట్టించగానే బండిలో మంటలొచ్చాయి.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం.. షాకింగ్ వీడియో..

ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద బైక్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బైక్‌లో పెట్రోల్‌ కొట్టించిన వెంటనే బండిలో నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు, వాహనదారులు, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది సైతం

పెట్రోల్ కొట్టించగానే బండిలో మంటలొచ్చాయి.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం.. షాకింగ్ వీడియో..
Kmm Bike Fire

Edited By:

Updated on: Jul 04, 2022 | 3:17 PM

ఖమ్మం జిల్లాలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. సత్తుపల్లిలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద బైక్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బైక్‌లో పెట్రోల్‌ కొట్టించిన వెంటనే బండిలో నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు, వాహనదారులు, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది సైతం భయంతో పరుగులు తీశారు. బైక్‌ను వెంటనే పక్కకు తీసి మంటలను అదుపుచేశారు. తక్షణమే స్పందించిన యువకులు చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు. లేదంటే పెట్రోల్‌ బంక్‌లో పెను ప్రమాదం సంభవించేది. క్షణాల్లో మంటలు ఆరిపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us