Breaking News
  • కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశ ప్రజలంతా రేపు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. సెలబ్రిటిలు కూడా ప్రధాని పిలుపుకు స్పందిస్తున్నారు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

బంద్ ఆపేది లేదు… దేనికైనా రెడీ అంటున్న జెఎసీ

Telangana state bundh will not stop says RTC Jac leaders, బంద్ ఆపేది లేదు… దేనికైనా రెడీ అంటున్న జెఎసీ

రేపటి తెలంగాణ బంద్‌పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత14 రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగా 19 వతేదీన రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల తర్వాత కూడా బంద్ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. హైకోర్టు తమ న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలని చర్చలకు పిలవడం లేదంటూ కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 10.30కు చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించిన మీదట చర్చలు జరుగుతాయా? లేదా అని ఉత్కంఠగా మారింది.

అయితే తమ డిమాండ్లలో ప్రధానమైన ఆర్టీసీ విలీనంతో పాటు అనేక అంశాలపై చర్చల ద్వారానే పరిష్కారం లభించగలదని కార్మిక సంఘ నేతలు మొదటినుంచి భావిస్తున్నారు. అయితే సమ్మెకు దిగడంతో రాష్ట్రప్రభుత్వం .. 48 వేలమంది ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం.. కార్మికుల్లో నైరాశ్యాన్ని నింపింది. అయితే హైకోర్టులో జరిగిన వాదనల్లో ప్రభుత్వ వైఖరిపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. పోరాటి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదంటూ ప్రధాన న్యాయమూర్తి పేర్కొనడం కూడా ఒక కీలకమైన అంశమే.

ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఇవ్వకపోవడం, ఆర్టీసీ హాస్పిటల్‌ను పునురుద్దరించకపోవడం, పూర్తి స్దాయిలో ఎండీని నియమించకపోవడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. అయితే వీటికి ప్రభుత్వ తరపున అడ్వొకేట్ జనరల్ వినిపించిన వాదనలపై న్యాయస్ధానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆర్టీసీ చేపట్టిన సమ్మెకు ప్రజల సంపూర్ణ మద్దతు ఇస్తే.. దాన్ని ఎవరూ ఆపలేరన్న కోర్టు.. వెంటనే చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకుని చర్చలు జరుపుతుందా? లేదా అన్ని మరో ప్రశ్నగా మారింది. మూడు రోజుల్లో చర్చలు జరిపాలంటూ ఆదేశించింది. పైగా ఈనెల 28 నాటికి చర్చల సారాంశాన్ని తమకు తెలియజేయాలని కూడా చెప్పింది. అయితే చర్చలపై కోర్టు ఆదేశాలను పాటిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగానే రేపు తెలంగాణ బంద్ యధావిధిగా కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ బంద్‌కు అధికార టీఆర్ఎస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలన్నీ మద్దతు ఇవ్వడంతో బంద్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Tags