వాహనదారులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..

Telangana says no to hefty traffic fines.. KCR says state will not harass people, వాహనదారులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ వాహనదారులకు ఊరట కల్పించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త మోటర్ వెహికిల్ చట్టంతో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. చట్టం వాహనదారుల సంక్షేమం కోసమే అయినా.. అందులో ఉన్న పెనాల్టీలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ కొత్త మోటర్ చట్టం అమలుకు నో చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ చట్టం అమలు చేయడానికి సుముఖత చూపడం లేదు. అంతేకాదు సొంత బీజేపీ పాలిత రాష్ట్రాలే దీనిని వ్యతిరేకిస్తూ.. పెనాల్టీలను సగానికి తగ్గించాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ చట్టాన్ని అమలు చేయమంటూ తేల్చి చెప్పారు. తాజాగా మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయం చెప్పారు. కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేయబోమని శాసనసభలో ప్రకటించారు. దేశ వ్యాప్తంగా వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న నేపథ్యంలో కేంద్ర ఈ కొత్త నూతన వెహికిల్ చట్టం తీసుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *