Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

సమ్మె పై మరోసారి హైకోర్టు విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

Telangana RTC Strike Continues, సమ్మె పై మరోసారి హైకోర్టు విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

ఆర్టీసీ సమ్మె విషయంలో అటు ప్రభుత్వం కాని, ఇటు కార్మిక సంఘాలు కాని ఏ మాత్రం తగ్గడం లేదు. కార్మికులు రోజు రోజుకు సమ్మెను మరింత ఉదృతం చేస్తుండగా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. బస్సుల సంఖ్యను పెంచుతోంది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడుతోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా తోడయ్యాయి. ఇక హైకోర్టు ఆదేశం, ప్రభుత్వం తీరుపై జేఏసీ నేతలు మరోసారి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోర్టులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ జరుపుతున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు రామ్ నగర్ చౌరస్తా వద్ద ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో ఇప్పటికే అన్ని వర్గాలు బంద్‌కు సహకరిస్తామని ప్రకటించాయి.

మరోవైపు ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. గత విచారణలో పలు కీలక వాఖ్యలు చేసింది హైకోర్టు. ఆర్టీసీ ఎండీని నియమించి చర్చలు ప్రారంభించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీసీ సమ్మె, ప్రజల సమస్యలపై పూర్తి వివరాలు తెలపాలని ఆదేశించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నేపథ్యంలో కోర్టు విచారణ కీలకంగా మారనుంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఎలాంటి సంకేతాలు రాలేదని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. ఇక సమ్మెతోపాటు పాఠశాలల సెలవుల పొడిగింపు విషయాన్ని కూడా కలిపి కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది.