తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కరోనా రోగులకు ఉచిత చికిత్స..

ప్రస్తుతం కరోనా బాధితులకు చికిత్స అందించే ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు మెడికల్ కాలేజీల్లో కోవిడ్‌కు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను..

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కరోనా రోగులకు ఉచిత చికిత్స..
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 12:57 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అందులోనూ హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ మరింత టెర్రర్ సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు, నటులు కూడా ఈ వైరస్ బారిన పడుతూండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం కరోనా బాధితులకు చికిత్స అందించే ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు మెడికల్ కాలేజీల్లో కోవిడ్‌కు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. మల్లా రెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కోవిడ్ టెస్టులు, చికిత్స ఉచితంగా అందేలా ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు తెలియాల్సి ఉండగా.. ఆ తర్వాత ఈ సేవలను మరిన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉంది.

కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరింది. ఇక నిన్న కరోనా నుంచి కోలుకుని 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,840 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే కరోనా బారినపడి మంగళవారం 10 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 375 మంది మరణించారు.

Read More:

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..

తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్‌తో.. వెబ్ సిరీస్‌లోకి హీరో సూర్య..