ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఫార్మాసిటీః మంత్రి కేటీఆర్

అంత‌ర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైద‌రాబాద్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. సుమారు 9 వేల ఎక‌రాల వ‌ర‌కు భూసేక‌ర‌ణ చేశామ‌ని చెప్పారు. ప్రశ్నోత్త‌రాల్లో భాగంగా స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు శాస‌న‌మండ‌లిలో మంత్రి స‌మాధాన‌మిచ్చారు

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఫార్మాసిటీః మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Sep 10, 2020 | 2:14 PM

అంత‌ర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైద‌రాబాద్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. సుమారు 9 వేల ఎక‌రాల వ‌ర‌కు భూసేక‌ర‌ణ చేశామ‌ని చెప్పారు. ప్రశ్నోత్త‌రాల్లో భాగంగా స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు శాస‌న‌మండ‌లిలో మంత్రి స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల ఇన్ఫర్మేషన్ ఒకే చోట చేర్చి బ్లూబుక్ తయారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఫార్మాసిటీని పొల్యూషన్ ఫ్రీగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే విండ్ ఫ్లోను స్టడీ చేశామని.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో యూనిట్ల స్థాపనకు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఫార్మాసిటీ కోసం మరికొంత భూమి సేక‌రించాల్సి ఉంద‌ని చెప్పారు. భూసేక‌ర‌ణ‌కు స్థానిక నేతలు, యువ‌త స‌హక‌‌రించార‌ని మంత్రి కేటీఆర్ కోరారు. భూ నిర్వాసితుల‌ందరికీ న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. న‌ష్ట‌పోయిన భూమికి ప‌రిహారంగా తిరిగి భూమి చెల్లించే యోచ‌న‌లేద‌ని స్పష్టం చేసిన కేటీఆర్.. ఫార్మాసిటీని అడ్డుకోవడానికి కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.