Amazon Offers: రూ. 89,600 విలువైన యాపిల్ ఐఫోన్ 15 ప్లస్.. కేవలం రూ. 16,730కే.. ఆలస్యం చేయకండి..

|

Aug 02, 2024 | 6:22 PM

అయితే యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ ను మీరు అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు అమెజాన్ కల్పిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్ ధర రూ. 89,600 కాగా.. దీనిని ఇప్పుడు కేవలం రూ. 16, 730కే దక్కించుకునే అవకాశాన్ని అమెజాన్ ప్లాట్ ఫారం కల్పిస్తోంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Amazon Offers: రూ. 89,600 విలువైన యాపిల్ ఐఫోన్ 15 ప్లస్.. కేవలం రూ. 16,730కే.. ఆలస్యం చేయకండి..
Apple Iphone15 Plus
Follow us on

ప్రపంచంలోనే ట్రెండీ ఫోన్ ఏదైనా ఉంది అంటే మొదటిగా గుర్తొచ్చేది యాపిల్ ఐఫోన్. దీనిని వినియోగించడం ఓ స్టేటస్ సింబల్ గా కూడా చాలా మంది ఫీల్ అవుతుంటారు. సాధారణంగా ఈ ఐఫోన్ సిరీస్ ఫోన్లు కాస్త ప్రీమియం ధరలోనే ఉంటాయి. అయితే యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ ను మీరు అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు అమెజాన్ కల్పిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్ ధర రూ. 89,600 కాగా.. దీనిని ఇప్పుడు కేవలం రూ. 16, 730కే దక్కించుకునే అవకాశాన్ని అమెజాన్ ప్లాట్ ఫారం కల్పిస్తోంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఆఫర్ ఇలా..

ఈ ఫోన్ 2023లో విడుదలైంది. బ్లాక్ కలర్లో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఉంటుంది. ఈ హై క్వాలిటీ స్మార్ట్ ఫోన్ ను చాలా చీప్ గా దక్కించుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ. 89,600 కాగా, దీనిపై అమెజాన్ 9శాతం ధరను తగ్గించింది. అంటే రూ. 81,900కి అందిస్తోంది. అయితే అంతకు మించే మీరు డబ్బును ఆదా చేసుకునే అవకాశాన్ని అమెజాన్ అందిస్తోంది. ఏకంగా రూ. 58,700లను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తోంది. అదెలా అంటే మీ పాత ఐఫోన్ ను ఎక్స్‌చేంజ్ చేస్తే ఈ తగ్గింపు లభిస్తుంది. అంతేకాక అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా మరో రూ. 6,470 తగ్గింపు లభిస్తుంది. మొత్తం మీద ఈ ఆఫర్లను కలుపుకుని యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ ని మీరు రూ. 16,730కే కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్లు..

డిస్ ప్లే.. ఐఫోన్ 15 ప్లస్ లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో ప్రోమోషన్ టెక్నాలజీ, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వీటి సాయంతో మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది.

ప్రాసెసర్.. దీనిలో సరికొత్త ఏ16 బయోనిక్ చిప్ ఉంటుంది. దీని సాయంతో అధిక పనితీరు, ఎఫిషీయన్సీని అందిస్తుంది. మల్టీ టాస్కింగ్ కు ఇది బాగా ఉపకరిస్తుంది.

కెమెరా.. ఈ ఫోన్లో వెనుక వైపు 48ఎంపీ ప్రధాన సెన్సార్ ఉంటుంది. ఇది తక్కువ కాంతి ఉన్న సమయంలో కూడా మంచి ఫోటో, వీడియో క్వాలిటీని అందిస్తోంది. అల్ట్రా వైడ్, టెలిఫొటో కెమెరాలు కూడా అందుబాటులో ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యం.. ఐఫోన్ 15 ప్లస్ లోని అత్యధిక సామర్థ్యం కలిగిపోయిన బ్యాటరీ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంటుంది. డిస్ ప్లే లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. యూఎస్బీ సీ పోర్టు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..