Xiaomi smart TVs: ఈ స్మార్ట్ టీవీల ఫీచర్లు అదుర్స్.. రూ.25 వేల ధర నుంచే ప్రారంభం

ఆధునిక సాంకేతిక యుగంలో అన్ని వస్తువులు లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో పోల్చితే వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఫోన్లు, వాచ్ లు, టీవీలు ఇలా అన్నింటిలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఇంటికి అవసరమైన వస్తువుల్లో టీవీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. దీని ముందు కూర్చుని కుటుంబ సభ్యులు వివిధ కార్యక్రమాలను వీక్షిస్తూ హాయిగా నవ్వకుంటారు. వారి మధ్య అనుబంధాలు మరింత బలోపేతమవుతాయి. ఈ నేపథ్యంలో మంచి ఫీచర్లు కలిగిన టీవీని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలాంటి వారి కోసం షియోమీ నుంచి రెండు బెస్ట్ స్మార్ట్ టీవీలు విడుదలయ్యాయి. వాటి ప్రత్యేకతలు, ధర వివరాలను తెలుసుకుందాం.

Xiaomi smart TVs: ఈ స్మార్ట్ టీవీల ఫీచర్లు అదుర్స్.. రూ.25 వేల ధర నుంచే ప్రారంభం
Mi Tv

Updated on: May 11, 2025 | 7:00 PM

ప్రముఖ బ్రాండ్ షియోమి మన దేశంలో క్యూలెడ్ టీవీ ఎఫ్ఎక్స్ ప్రో, 4కె టీవీ ఎఫ్ఎక్స్ సిరీస్ స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. తద్వారా మార్కెట్ లో తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. ఈ రెండు స్మార్ట్ టీవీలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. హై-ఎండ్ ఆడియో విజువల్, స్మార్ట్ హోమ్ ఫీచర్లతో వీక్షకులకు సినిమా థియేటర్ అనుభవాన్ని కలిగిస్తాయి. ఇవి మే 12వ తేదీ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి.

షియోమి క్యూలెడ్ టీవీ ఎఫ్ఎక్స్ ప్రో విషయానికి వస్తే.. దీనిలోని 43 అంగుళాల టీవీ ధర రూ.27,999 కాగా.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు రూ.2 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఆ కార్డు ద్వారా ఈఎంఐ విధానంలో రూ.25.999కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్.ఇన్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కమ్ లలో ఈ టీవీ అందుబాటులో ఉంది. ఇక దీనిలోనే 55 అంగుళాల టీవీపై కూడా హెచ్ డీఎఫ్ సీ క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. కేవలం రూ.37,999కి కొనుగోలు చేసుకోవచ్చు. అమెజాన్.ఇన్, ఎంఐ.కమ్ లో అందుబాటులో ఉంది.

షియోమి 4కే టీవీ ఎఫ్ ఎక్స్ కు సంబంధించి 43 అంగుళాల టీవీ అసలు ధర రూ.26,499 కాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్యాష్ బ్యాక్ ద్వారా రూ.24,499కి కొనవచ్చు. అమెజాన్.ఇన్, ఎంఐ.కమ్ లో ఈ టీవీ దొరుకుతుంది. 55 అంగుళాల టీవీని రూ.34,999కి సొంతం చేసుకోవచ్చు. దీనికి హెచ్ డీఎఫ్ సీ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్.ఇన్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కమ్ లలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

రెండు స్మార్ట్ టీవీలూ హెచ్ డీఆర్10 ప్లస్ సపోర్టుతో ప్రతి ఫ్రేమ్ ను చక్కగా చూపిస్తాయి. డాల్బీ అట్మోస్ ద్వారా ట్యూన్ చేసిన 34 డబ్ల్యూ బాక్స్ స్పీకర్లతో ఆడియో చాలా బాగుంటుంది. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, జీ5, సోనీ ఎల్ఐవీ నుంచి అనేక కార్యక్రమాలను వీక్షించొచ్చు. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్, యూట్యూబ్ తదితర వాటి ద్వారా కంటెంట్ ను ఆస్వాదించగలరు. తమ హోమ్ స్క్రీన్ నుంచి డీటీహెచ్ టీవీ చానెళ్లు, ఓటీటీ యాప్ ల మధ్య సజావుగా మారవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి