
ప్రతీ ఒక్కరి ఇంట్లో విద్యుత్ ప్లగ్గులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ అందించేందుకు, చార్జింగ్ లాంటివి పెట్టుకునేందుకు ఎలక్ట్రిక్ ప్లగ్గులు అనేవి ఉపయోగపడతాయి. అయితే మీరు వీటిని పరిశీలిస్తే మూడు పిన్నులు మాత్రమే ఉంటాయి. అందులో పై పిన్ను పొడవుగా, లావుగా ఉంటే.. కింద ఉండే రెండు పిన్నులు చిన్నగా ఉంటాయి. పై పిన్ను అలా పొడవుగా ఎందుకు ఉంటుందంటే..?

ఈ పెద్ద పిన్ను వెనుక అనేక రహస్యాలు ఉంటాయి. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పిన్నును ఎర్తింగ్ పిన్ను లేదా గ్రౌండ్ పిన్నుగా పిలుస్తారు. విద్యుత్ షాక్ తగలకుండా ఇది కాపాడుతుంది. విద్యుత్ లీక్ అయినప్పుడు ఇది దానిని భూమిలోకి పంపుతుంది. ఏదైనా వైర్ తెగి బాడీకి తగిలినప్పుడు ఆ పిన్ను ద్వారా విద్యుత్ భూమిలోకి వెళుతుంది. దీని వల్ల విద్యుత్ షాక్ అనేది ఉండదు.

ఇక మనం సాకెట్‌లో ప్లగ్‌లను పెట్టినప్పుడు ముందుగా ఎర్తింగ్ పిన్ లోపలికి వెళుతుంది. దీని వల్ల వస్తువులో ఏదైనా విద్యుత్ లీకేజీ ఉన్నా భూమిలోకి వెళుతుంది. దీని వల్ల మనం ఆన్ చేయకముందే కరెంట్‌ను భూమిలోకి పంపించడం వల్ల మనం సురక్షితంగా ఉంటాం. ఇక చివరిగా ప్లగ్ తీసేటప్పుడు కూడా ఇదే చివరిగా వస్తుంది.

దీంతో ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా మూడు ప్లగ్గుల పిన్‌ను వాడతారు. దీని వల్ల విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం తక్కువగా ఉంటుంది. రెండు ప్లగ్గుల పిన్ వాడితే ప్రమాదం బారిన పడవచ్చు. వర్షాకాలంలో లేదా తడి చేతులతో ఎలక్ట్రానిక్ వస్తువులను తాకినప్పుడు కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అదే మూడు ప్లగ్గుల పిన్ ఉండటం వల్ల ప్రమాదం తగ్గుతుంది.

ఇక ప్రతీ ఇంటికి ఎర్తింగ్ సౌకర్యం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్లగ్‌లు కొనుగోలు చేసే సమయంలో మూడు పిన్‌లు ఉన్నది మాత్రమే కొనుగోలు చేయండి. దీన వల్ల మీ ఇంటికి రక్షణ కవచంగా ఇది పనిచేస్తుంది. రెండు ప్లగ్‌లు ఉన్నవి వాడకపోవడమే మంచిది.