
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడడం కామన్. ఈ యాప్ వచ్చిన నుంచి డైరెక్ట్‌గా మాట్లాడుకోవడమే తగ్గిపోయింది. ఏ విషయమైనా వాట్సాప్‌లోనే.. వాట్సాప్ కూడా తన యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో వాట్సాప్ త్వరలో తన వినియోగదారుల కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తరహాలో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అదే ప్రొఫైల్‌కు కవర్ ఫోటో జోడించే అవకాశం.
సాధారణంగా ఫేస్‌బుక్ లేదా లింక్డ్‌ఇన్‌లో కనిపించే విధంగా.. యూజర్లు తమ ప్రొఫైల్ ఫోటో పైన పెద్ద చిత్రంగా ఈ కవర్ ఫోటోను పెట్టుకోగలుగుతారు. దీని ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్‌లో ఫోటోలను ప్రదర్శించడానికి ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ అప్‌డేట్స్‌తో పాటు మరొక కొత్త స్పేస్‌ను పొందుతారు. ఇది యూజర్ ప్రొఫైల్ పైభాగంలో అందంగా కనిపిస్తుంది.
WABetaInfo అందించిన సమాచారం ప్రకారం.. కవర్ ఫోటో ఫీచర్‌పై వాట్సాప్ చాలా కాలంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడే కొంతమందికి, బీటా వెర్షన్ 2.25.32.2 లో వాట్సాప్ దీనిని టెస్ట్ చేస్తోంది. టెస్టింగ్ పూర్తయిన వెంటనే, ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రావచ్చు. మొదటగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు వస్తుంది.
మీరు పెట్టుకునే ఈ కవర్ ఫోటోను ఎవరు చూడాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ప్రొఫైల్ ఫోటోకు ఉన్నట్టే, దీనికీ ప్రైవసీ సెట్టింగ్‌లు ఉంటాయి.
ఎవ్రీ వన్: ఎవరైనా సరే, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేనివారు కూడా మీ కవర్ ఫోటోను చూడొచ్చు.
మై కాంటాక్ట్స్: మీ ఫోన్‌లో నంబర్ సేవ్ చేసుకున్నవారు మాత్రమే చూడొచ్చు.
నో బడీ: మీ కవర్ ఫోటోను ఎవరికీ కనిపించకుండా పెట్టవచ్చు.
ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ ప్రొఫైల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి