WhatsApp: వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. కొత్తగా మూడు అద్బుత ఫీచర్లు..

Updated on: Aug 05, 2026 | 6:15 PM

వాట్సప్ అదిరిపోయే ఫీచర్లు తీసుకొచ్చింది. ఒకేసారి మూడు ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీటిని దశలవారీగా ప్రవేశపెట్టనుంది. వాట్సప్‌ను సులువుగా ఉపయోగించడానికి ఇవి సహాయపడనున్నాయి. వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు వీటిని కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
వాట్సప్ వాడేవారికి భారీ గుడ్ న్యూస్. మరో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్‌ను సులభతరంగా ఉపయోగించేందుకు ఈ ఫీచర్లు ఎంతోగానే ఉపయోగపడనున్నాయి. పెద్ద గ్రూప్ చాట్‌లలో సమన్వయాన్ని సులభతరం చేసుకోవడంతో పాటు ఓటింగ్ గడువును మార్చుకోవడానికి, అనామక స్పందనలను పంపడానికి వినియోగదారులను అనుమతించేలా యాప్‌లో మెరుగైన పోల్స్‌ను జోడించింది. ఈ కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
గ్రూప్ చాట్‌లోని వినియోగదారులందరికీ సమయానికి సంబంధించిన మెస్సేజ్‌ల గురించి ఒకేసారి తెలియజేయవచ్చు. ట్యాగింగ్ ఫీచర్ ద్వారా ఈ పని చేయవచ్చు. అలాగే ఇప్పటికే ఉన్న గ్రూపు సభ్యులతో కొత్త గ్రూప్ చాట్‌లను త్వరగా క్రియేట్ చేయవచ్చు. అలాగే గ్రూపు ఛాటుల్లో పోలింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ పోల్స్‌కు ముగింపు సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ సమయం తర్వాత ఆటోమేటిక్‌గా ఓటింగ్ క్లోజ్ అవుతుంది.

3 / 5
ఇక పోలింగ్‌లో ఓటర్ల పేరు కనిపించకుండా చేసే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల పోలింగ్‌లో పాల్గొనేవారు తమ పేరు తెలియకుండా గోప్యంగా ఉంచుకోవచ్చు. ఇక పోల్ క్రియేట్ చేసినవారు పోస్ట్ చేసిన 15 నిమిషాల్లోపు ప్రశ్నలను ఎడిట్ చేసుకోవచ్చు. అక్షర దోషాలను సరిదిద్దుకోవడంతో పాటు ఆప్షన్లను మార్చుకోవచ్చు. దీని వల్ల ఏమైనా తప్పులుంటే డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎడిట్ చేసుకోవచ్చు.

4 / 5
ఈ కొత్త ఫీచర్లు వాట్సాప్‌లో దశలవారీగా విడుదల చేయనున్నట్లు వాట్సప్ తెలిపింది. రాబోయే కొన్ని వారాల్లో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇక గ్రూపులకు @all మెన్షన్స్‌ ఫీచర్ తీసుకొచ్చింది. దీని వల్ల ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన పని లేకుండా అందరికీ ఒకేసారి మెన్షన్ చేయవచ్చు. 32 మంది కంటే ఎక్కువ గ్రపు సభ్యులు ఉంటే అడ్మిన్స్ మాత్రమే @all ఫీచర్‌ ఉపయోగించుకోవచ్చు. ఇతర గ్రూపు సభ్యులు యాప్ నోటిఫికేషణ్ సెట్టింగ్స్‌లో  @all ఫీచర్‌ను మ్యూట్ చేసుకోవచ్చు.

5 / 5
ఇక ఇప్పటికే ఉన్న గ్రూపు నుంచి నేరుగా కొత్త గ్రూప్ క్రియేట్ చేయవచ్చు. దీనివల్ల సభ్యులను మళ్లీ మాన్యువల్‌గా జోడించాల్సిన అవసరం ఉండదు. అసలు గ్రూప్‌కు అంతరాయం కలిగించకుండా పక్క సంభాషణలు ప్రారంభించడానికి, ఈవెంట్ లాజిస్టిక్స్ నిర్వహించడానికి, సర్ప్రైజ్ పార్టీని ప్లాన్ చేయడానికి లేదా ఒక నిర్దిష్ట అంశంపై విడిగా చర్చించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us