వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

వివో భారత్ మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్‌ను విడుదల చేసింది. అదే ఇయర్ బడ్స్. ఇందులో అనేక ఫీచర్లు ఉండగా.. కేవలం రూ.1999కే లభిస్తుంది. వాయిస్ క్యాన్సిలేషన్, మెరుగైన ప్లే బ్యాక్ ఇది అందిస్తోంది. ఇక కాల్స్ కోసం నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి.

వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
Vivo

Updated on: Sep 11, 2026 | 9:41 AM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో మరో కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇయర్ బడ్స్ తయారీలో కూడా వివో దూసుకెళ్తుంది. అందులో భాగంగా తాజాగా భారత మార్కెట్లోకి వివో బడ్స్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లను ఇవి కలిగి ఉన్నాయి. ఇవి బ్యాటరీ లైఫ్, ఆడియో ఫీచర్లు క్వాలిటీతో పాటు తక్కువ లేటెన్సీతో కూడిన గేమింగ్, మల్టీపాయింట్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. ఒక్కో ఇయర్‌బడ్ బరువు సుమారు 3.8 గ్రాములు ఉంటుంది. ఇక IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉన్నాయి. రెండు రంగుల్లో వీటిని విడదుల చేశారు. బసాల్ట్ బ్లాక్, నీలగిరి గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. వీటి ధర కేవలం రూ.1,999గా ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు ఇవే..

వివో బడ్స్ 10mm డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించడంతో పాటు డీప్‌ఎక్స్ 4.0 సౌండ్ ఎఫెక్ట్‌లకు సపోర్ట్ చేస్తాయి. మెగా బాస్, క్లియర్ వాయిస్, క్లియర్ హై పిచ్, ఆడియోబుక్ లిజనింగ్ మోడ్‌లు ఉన్నాయి. 10-బ్యాండ్ ఈక్వలైజర్ సౌండ్‌ను సర్దుబాటు చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ థియేటర్, కాన్సర్ట్ హాల్, స్టూడియో, లైవ్ కాన్సర్ట్ అనే నాలుగు మోడ్‌లతో స్పేషియల్ ఆడియోకు కూడా మద్దతు ఇస్తాయి. కాల్స్ మాట్లాడేందుకు నాలుగు మైక్రోఫోన్‌లు ఉన్నాయి. ఇక ఏఐ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్ కూడా ఉంది. దీంతో బయట ఉన్నప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా స్పష్టంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. గాలి శబ్దాన్ని తగ్గించడానికి విండ్ నాయిస్ రిడక్షన్ ఛాంబర్ కూడా ఉంది. బ్లూటూత్ 6.1 మరియు రెండు డివైజ్‌ల కోసం మల్టీపాయింట్ సపోర్ట్ ఉన్నాయి. ఇది 42ms గేమింగ్ లేటెన్సీని కూడా అందిస్తుంది. ఫైండ్ మై వివో బడ్స్, వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్చ, రిమోట్ కెమెరా కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్లేబ్యాక్, కాల్స్, ట్రాక్ ఎంపిక, ఇతర ఫంక్షన్‌ల కోసం టచ్ కంట్రోల్స్‌ను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. వివో స్మార్ట్‌ఫోన్‌లలో పెయిరింగ్ సమయంలో పెంపుడు జంతువుల థీమ్‌తో కూడిన యానిమేషన్ కనిపిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ ఇతర స్మార్ట్‌ఫోన్ ఎకోసిస్టమ్స్‌లోని పరికరాలకు కూడా కనెక్ట్ చేస్తుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

IP54 రేటింగ్‌ అనేది ఇయర్‌బడ్స్‌కు వర్తిస్తుంది. ఛార్జింగ్ కేస్‌కు వర్తించదని గుర్తించారు. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఈ బడ్స్ 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. ఒకే ఛార్జ్‌పై 12 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. 10 నిమిషాల ఛార్జ్‌తో నాలుగు గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుంది. అలాగే ఒకే ఛార్జ్‌పై ఏడు గంటల వరకు కాలింగ్ సౌకర్యం ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us