ఆ ఫోన్లలో 5జీ పని చేయదు.. ఎందుకో తెలుసా?

|

Oct 18, 2019 | 6:53 PM

4జీ యుగం అయిపొయింది. ఇప్పుడు వచ్చేదంతా 5జీ యుగమేనని అంతా అనుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లో 5జీ మొబైల్స్ మార్కెట్‌‌‌‌‌‌‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన గూగుల్, వన్ ప్లస్‌లు మాత్రం తమ కొత్త మొబైల్స్‌కు 5జీ ఫీచర్ లేకుండా తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్‌ 4, వన్‌ప్లస్‌ 7టి ప్రో మోడళ్లను 5జీ ఫీచర్‌ లేకుండా లాంచ్‌ అయ్యాయి. దీని మీదే ఇప్పుడు టెకీలందరూ చర్చించుకుంటుండగా.. ఇటీవలే ఆ సంస్థలు […]

ఆ ఫోన్లలో 5జీ పని చేయదు.. ఎందుకో తెలుసా?
Follow us on

4జీ యుగం అయిపొయింది. ఇప్పుడు వచ్చేదంతా 5జీ యుగమేనని అంతా అనుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లో 5జీ మొబైల్స్ మార్కెట్‌‌‌‌‌‌‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన గూగుల్, వన్ ప్లస్‌లు మాత్రం తమ కొత్త మొబైల్స్‌కు 5జీ ఫీచర్ లేకుండా తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్‌ 4, వన్‌ప్లస్‌ 7టి ప్రో మోడళ్లను 5జీ ఫీచర్‌ లేకుండా లాంచ్‌ అయ్యాయి. దీని మీదే ఇప్పుడు టెకీలందరూ చర్చించుకుంటుండగా.. ఇటీవలే ఆ సంస్థలు పూర్తి క్లారిటీ ఇచ్చాయి.

టెక్ ప్రపంచం అంతా పిక్సెల్ 4 మోడల్‌ను గూగుల్ 5జీ ఫీచర్‌తో విడుదల చేస్తుందని ఊహించారు. కానీ పిక్సెల్ 4 సిరీస్ మొబైల్స్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయవని ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై ప్రొడక్ట్‌ డిజైన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ బ్రియాన్‌ రకౌస్కీ మాట్లాడుతూ.. ‘‘మేం తప్పకుండా 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేసే ఫోన్లను అందుబాటులోకి తెస్తాము. కానీ దానికి  ఇది సరైన సమయం కాదని గూగుల్‌ భావిస్తోంది. విస్తరణ, నెట్‌వర్క్‌ పరంగా ఇప్పటికీ 5జీ నెట్‌వర్క్‌ అన్నిచోట్లా అందుబాటులో లేదు. దీంతో అతి తక్కువ మందికే 5జీ చేరువవుతోంది. దీనికి డిమాండ్‌ ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా వృద్ధిలోకి రాలేదు. అంతా సిద్ధమయ్యాక మేం 5జీ ఫోన్‌ తీసుకొస్తాం’’ అని పేర్కొన్నారు.

అటు వన్ ప్లస్ సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సంస్థ సీఈఓ మాట్లాడుతూ ‘ప్రతి మోడల్‌లో 5జీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. తాము 5జీ మోడల్ ఫోన్లు తయారు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని.. అంతేకాక వాటి తయారీకి ప్రస్తుత పరిస్థితులు ఎంతవరకు సబబు అనే దానిపై దృష్టి సారించామని అన్నారు.