Holi 2024: రంగుల సంబరం.. మీ ఫోన్ జర భద్రం! రంగులు పడితే నష్టపోతారు..

|

Mar 25, 2024 | 6:47 AM

అయితే రంగుల సంబరాన్ని నిర్వహించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే కొన్ని నష్టాలు కలుగుతాయి. అవి పండగ ఆనందాన్ని మనకు దూరం చేస్తాయి. హోలీ పండగలో రంగులు పూసుకునేటప్పుడు, నీరు పోసుకునేటప్పుడు మీ స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్‌లు పాడవకుండా రక్షించుకోవాలి. రంగులు లేదా నీరు పడి అవి పాడయ్యే ప్రమాదం ఉంది.

Holi 2024: రంగుల సంబరం.. మీ ఫోన్ జర భద్రం! రంగులు పడితే నష్టపోతారు..
Holi Color Stains
Follow us on

మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ హోలీ. రంగులు చల్లుకుంటూ, డ్యాన్సులు చేస్తూ సంతోషంగా గడిపే సమయం ఇది. గ్రామాల నుంచి పట్టణాల వరకూ పిల్లల నుంచి పెద్దల వరకూ.. సంపున్నుల నుంచి సమాన్యుల వరకూ అందరూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే రంగుల సంబరాన్ని నిర్వహించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే కొన్ని నష్టాలు కలుగుతాయి. అవి పండగ ఆనందాన్ని మనకు దూరం చేస్తాయి. హోలీ పండగలో రంగులు పూసుకునేటప్పుడు, నీరు పోసుకునేటప్పుడు మీ స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్‌లు పాడవకుండా రక్షించుకోవాలి. రంగులు లేదా నీరు పడి అవి పాడయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల మీకు ఆర్థికంగా నష్టం కలగడంతో పాటు విలువైన సమాచారం కూడా పోయే ప్రమాదం ఉంది.

నష్టం కలగకుండా..

ఒకవేళ మీరు హోలీ లో పాల్గొనపోయినా, ఉద్యోగం లేదా వ్యాపారం పనిమీద వెళుతున్నా మీ ఆత్మీయులు, స్నేహితులు నీరు, రంగులు చల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ క్రింద జాగ్రత్తలు పాటిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇవి కూడా చదవండి
  • మీ సమీపంలోని అన్ని దుకాణాల్లో జిప్ లాక్ బ్యాగులు దొరుకుతాయి. వాటిని కొనుక్కొని మీ స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రపర్చకుని తీసుకువెళ్లవచ్చు. హోలీ సందర్భంగా ఎవరైనా రంగులు చల్లినా, నీరు పోసినా మీరు తడిచిపోతారు తప్ప, మీ వస్తువులకు నష్టం కలగదు.
  • మీ ఫోన్, ఈయర్‌బడ్లు తదితర వాటికి జిప్ లాక్ బ్యాగ్ రక్షణ లభిస్తుంది. నీరు, ఇతర దుమ్ము, ధూళి కణాలు పరికరాలలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
  • మీ ఫోన్‌ని అన్‌లాక్ చేసే విధానాన్ని మార్చండి. బయోమెట్రిక్, ఫేస్ లాక్ కు బదులు పిన్ నంబర్ ను సెట్ చేసుకోండి. దీనివల్ల మీ ముఖం నిండా రంగుఉన్నా, చేతులకు రంగు అయినా ఫోన్ ఉపయోగించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే అత్యవసర సమయంలో ఫోన్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు.
  • ఫోన్ కు ఉన్నపోర్ట్ లు, బటన్లు, స్పీకర్ గ్రిల్, ఈయర్ పీస్ తదితర వాటి ద్వారా నీరు, రంగులు లోపలకు వెళ్లిపోతాయి. వాటిని నిరోధించడానికి వాటిపై టేప్ ను అతికించవచ్చు. టేప్‌ను అప్లై చేసిన తర్వాత స్పీకర్‌లు పాడవకుండా ఉండటానికి ఫోన్‌ను వైబ్రేషన్ మోడ్‌లో ఉంచుకోవాలి.
  • మీ ఫోన్ తడిగా ఉన్నప్పుడు, నీటిలో మునిగిపోయినప్పుడు వెంటనే చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించకండి. ఫోన్ పూర్తిగా ఆరిపోయే వరకు వేచి చూడాలి.
  • తడిచిన ఫోన్ ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్, బ్లో డ్రైయింగ్ వంటి వాటిని వాడకండి. వాటి ద్వారా వేగంగా వచ్చే గాలి మీ ఫోన్లలోని సున్నిత భాగాలను దెబ్బతిస్తుంది. అలాగే నోటితో వేగంగా ఊదడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది.
  • హోలీ ఆడుతున్నప్పుడు పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లవద్దు. నీరు పడితే ఇది చాలా త్వరగా పాడవుతుంది.
  • ఆధునిక ఫోన్లలో ఐపీ రేటింగ్ టెక్నాలజీ ఉంది. అది దుమ్ము, ధూళి నుంచి మీ ఫోన్ ను రక్షిస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. అయినా నష్టాన్ని కవర్ చేయడానికి నిబంధనలు ఉంటాయి. వారంటీ కింద నీటి నష్టాన్ని ఏ కంపెనీ భరించదని గమనించండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..