Nomophobia: మీక్కూడా ఇలాగే ఉందా.? అయితే మీరు నోమోఫోబియాతో బాధపడుతున్నట్లే..

చేతిలో క్షణం స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే భయపడే పరిస్థితి ఉంది. దీనిని నిపుణులు నోమోఫోబియాగా అభివర్ణిస్తున్నారు. ఒకవేళ స్మార్ట్ ఫోన్‌ చేతిలో లేకపోయినా.. ఇంటర్నెట్ కనెక్షన్‌ పోయినా కొందరిలో ఖంగారు, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి దీనినే నోమోఫోబియాగా చెబుతున్నారు. దీనినే సాధారణ భాషలో నో-మొబైల్-ఫోబియాగా పిలుస్తుంటారు...

Nomophobia: మీక్కూడా ఇలాగే ఉందా.? అయితే మీరు నోమోఫోబియాతో బాధపడుతున్నట్లే..
Nomophobia
Follow us

|

Updated on: Jul 19, 2024 | 3:26 PM

ప్రస్తుతం మొబైల్‌ను ఉపయోగించని వారిని భూతద్ధంలో వేసి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ అనివార్యంగా మారింది. అయితే స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం ఒక వ్యసనంగా మారిపోయింది. మాటలు రాని పిల్లలు కూడా స్మార్ట్‌ ఫోన్స్‌కి అలవాటు పడుతున్నారు. చివరికి అన్నం తినిపించాలంటే కూడా చేతిలో స్మార్ట్‌ ఫోన్స్ పెట్టే పరిస్థితులు వచ్చాయి.

చేతిలో క్షణం స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే భయపడే పరిస్థితి ఉంది. దీనిని నిపుణులు నోమోఫోబియాగా అభివర్ణిస్తున్నారు. ఒకవేళ స్మార్ట్ ఫోన్‌ చేతిలో లేకపోయినా.. ఇంటర్నెట్ కనెక్షన్‌ పోయినా కొందరిలో ఖంగారు, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి దీనినే నోమోఫోబియాగా చెబుతున్నారు. దీనినే సాధారణ భాషలో నో-మొబైల్-ఫోబియాగా పిలుస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇదొక మానసిక స్థితి. ఈ ఫోబియాతో బాధపడుతున్న వ్యక్తులు వారి స్మార్ట్‌ఫోన్ లేదా గ్యాడ్జెట్స్‌ దూరంగా ఉంటే ఏదో తెలియని ఆందోళనకు గురవుతుంటారు.

ఏదైనా నెట్‌వర్క్‌ లేని ప్రదేశానికి వెళ్తుంటే ఈ ఫోబియాతో బాధపడేవారు భయపడుతుంటారు. ఫోన్‌లో బ్యాటరీ అయిపోతున్నప్పుడు ఆందోళన చెందుతుంటారు. ఎలాంటి అత్యవసరం లేకపోయినా అయ్యో బ్యాటరీ అయిపోతోందని ఆందోళ చెందుతుంటారు. కాసేపు ఇంటర్‌నెట్ కనెక్షన్‌ లేకపోయినా.. ఫోన్‌ని పదేపదే చెక్‌ చేస్తుంటారు. ఫోన్‌ కాసేపు తమకు దూరంగా ఉన్నా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అయితే దీనిని లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.

నోమోఫోబియా నుంచి బయటపడాలంటే మొబైల్‌ ఫోన్‌కి దూరంగా ఉండడం అలవాటుగా మార్చుకోవాలి. ఇందుకోసం ఇతర వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి. ఫోన్‌లో పదే పదే వచ్చే నోటిఫికేషన్స్‌ కూడా ఆందోళనకు గురి చేస్తుంటాయి. కాబట్టి ముఖ్యమైనవి అయితే మాత్రమే వాటిని ఆన్‌ చేసుకోవాలి. దీంతో ఫోన్‌ని పదే పదే చూడడం మానుకుంటారు. వాకింగ్ చేయడం, గేమ్స్‌ ఆడుకోవడం లాంటివి అలవాటు చేసుకోవాలి. ఇక ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేయడం లాంటి పూర్తిగా తగ్గించాలి. స్నేహితులతో భౌతికంగా మాట్లాడడం, వారితో నిత్యం టచ్‌లో ఉండాలి. బ్రౌజింగ్‌కు బదులుగా పుస్తకాలు చదడం అలవాటు చేసుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..