అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్.. మన ఇండియన్ కంపెనీనే..

విదేశీ కంపెనీలకు పోటీగా స్వదేశీ కంపెనీలు కూడా కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. భారత కంపెనీ అయిన లావా కొత్తగా ఏఐ టెక్నాలజీతో ఒక స్మార్ట్‌ఫోన్ తెస్తుండగా.. తాజాగా మరో ఇండియన్ కంపెనీ అయిన ఓబుల్ వన్ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేస్తోంది.

అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్.. మన ఇండియన్ కంపెనీనే..
Wobble One

Updated on: Nov 21, 2025 | 11:02 AM

Wobble One: స్మార్ట్‌ఫోన్లు అనగానే ఒకప్పుడు చైనా, జపాన్, అమెరికా కంపెనీలు ఎక్కువగా గుర్తుకొచ్చేవి. కానీ కేంద్ర ప్రభుత్వం మేడిన్ ఇండియా నినాదంతో స్వదేశంలో తయారయ్యే ప్రొడక్ట్స్‌ను ప్రోత్సహిస్తోంది. భారత్‌లో తయారయ్యే ప్రొడక్ట్స్‌కు అనేక ప్రోత్సహాకాలు కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో విదేశీ కంపెనీలు భారత్‌లోనే తమ ప్లాంట్స్‌ను నెలకొల్పి ఇక్కడే తమ ప్రొడక్ట్స్‌ను తయారుచేస్తుండగా.. భారత్ కంపెనీలు కూడా విదేశీ కంపెనీలకు పోటీగా నిలుస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల రంగంలో ఇప్పటికే లావా, మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ వంటి కంపెనీలు ఉండగా.. తాజాగా స్వదేశీ కంపెనీ అయిన ఇండ్‌కల్ టెక్నాలజీస్ సంస్థ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది.

వోబుల్ వన్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే డిసెంబర్ 12 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు షురూ కానున్నాయి. మూడు వేరియెంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.22,000గా ఉండగా..8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియెంట్ల ధర ఎంతనేది వివరాలు ఇంకా వెల్లడించలేదు.

వోబుల్ వన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇవే..

6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే

మీడియాటెక్‌ 7400 ప్రాసెసర్‌

వెనకవైపు 50ఎంపీ సోనీ LYT-600 కెమెరా

8 ఎంపీ అల్ట్రావైడ్+ బొకే కెమెరా

50 ఎంపీ సెల్ఫీ కెమెరా

 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి